కొన్నిసార్లు ఆలస్యం కూడా చాలా మేలు చేస్తుంది. రైలు జీవిత కాలం లేట్ అనే సామెత పాజిటివ్ కోణంలో తీసుకోవచ్చు. దానికి ఉదాహరణగా నిలుస్తోంది నిఖిల్ 18 పేజెస్. దీని షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. సుకుమార్ రచనలో కుమారి 21 ఎఫ్ ఫేమ్ సూర్య ప్రతాప్ దర్శకుడు. నాలుగు నెలల క్రితమే టీజర్ వచ్చింది. గీతా ఆర్ట్స్ టూ లాంటి అగ్ర బ్యానర్ నిర్మాణం, టాప్ టెక్నికల్ టీమ్ వెరసి ఇంత ఆలస్యం ఎందుకనే అనుమానాలు ఫ్యాన్స్ లో లేకపోలేదు. కార్తికేయ 2నే దీనికన్నా లేట్ గా పూర్తయ్యింది. ఇప్పుడదే కలిసొస్తోంది.
కార్తికేయ 2 రిజల్ట్ ప్యాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోవడంతో ఇప్పుడా ఫ్యాక్టర్ 18 పేజెస్ బిజినెస్ కి బ్రహ్మాండంగా పనికొస్తుంది. రెండింటిలోనూ అనుపమ పరమేశ్వరనే హీరోయిన్ కావడం కాకతాళీయంగా జరిగిందే అయినా ఇప్పుడా అంశాన్ని కూడా హై లైట్ చేసుకోవచ్చు. ఎలాగూ తనతో పాటు నిఖిల్ కు నార్త్ ఆడియన్స్ లో గుర్తింపు వచ్చింది కాబట్టి జస్ట్ హిందీ డబ్బింగ్ చేస్తే చాలు హక్కుల రూపంలో మంచి ఆదాయం చేతికి అందుతుంది. మార్కెటింగ్ లో ఎలాగూ గీతా ఆర్ట్స్ నైపుణ్యం తెలిసిందే కాబట్టి లాభాలు ఖాయం.
దీనికే కాదు నిఖిల్ తర్వాతి మూవీ స్పైకు సైతం ఇదంతా కలిసొచ్చేదే. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ లు దాటుకుని మరీ ఏకంగా అరవై కోట్ల మార్కును దాటేసిన కార్తికేయ 2 తాలూకు సక్సెస్ కిక్ నిఖిల్ మోహంలో మాములుగా కనిపించడం లేదు. 18 పేజెస్ ని వాయిదా వేసుకుంటూ రావడానికి కారణం ఏదైనా అది మంచే చేసింది. ఫాంటసీ జానర్ కానప్పటికీ ఇందులో వైవిధ్యమైన లవ్ కాన్సెప్ట్ తో ఏదో థ్రిల్లర్ టచ్ కూడా ఇచ్చినట్టున్నారు. కార్తికేయ 2 వేడి చల్లారాక వెంటనే ప్రమోషన్లు మొదలుపెట్టేందుకు ప్లానింగ్ జరుగుతోందట.
This post was last modified on August 21, 2022 8:36 am
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…