Movie News

తండ్రి పేరుతో చిరంజీవి హాస్పిటల్

దాసరి నారాయణరావు మరణానంతరం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా మారారు మెగాస్టార్ చిరంజీవి. ఇదేమీ అధికారిక పదవి కాదు. ఆయనేమీ దాన్ని కోరి తీసుకోలేదు. తనకున్న స్థాయి వల్ల ఇండస్ట్రీలో చాలామంది ఆయన ఆ స్థానంలోకి రావాలని కోరుకున్నారు. చిరు కూడా అందుకు కాదనలేకపోయారు. దీన్ని ఒక హోదాలా కాకుండా బాధ్యతగా భావించి కరోనా కాలంలోనే కాక పలు సందర్భాల్లో పరిశ్రమ మేలు కోసం పాటుపడుతున్నారాయన. కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేయడమే కాక.. అనేక రకాలుగా ఇండస్ట్రీని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు చిరు.

ఈ క్రమంలోనే సినీ కార్మికుల కోసం ఆసుపత్రి కట్టాలనుకుంటున్న విషయాన్ని కొన్ని నెలల కిందట మే డే వేడుకల్లో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు అనవసర విమర్శలు చేసినా చిరు పట్టించుకోలేదు. ఆ ఆసుపత్రి విషయంలో ఆయన సంకల్పంతోనే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

తాజాగా హైదరాబాద్‌లో సెలబ్రెటీ క్రికెట్ కార్నివాల్‌కు సంబంధించి జెర్సీల ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చిరు.. ఈ ఆసుపత్రి గురించి వివరాలు వెల్లడించారు. తన తండ్రి కొణిదెల వెంకట రావ్ పేరు మీద చిత్రపురి కాలనీలో నివసించే కార్మికుల కోసం ఆసుపత్రి కట్టించబోతున్నట్లు చిరు వెల్లడించారు. ఈ ఆలోచన వచ్చినప్పటి నుంచి దానిపై పని చేస్తున్నట్లు తెలిపారు. ఎన్ని కోట్లయినా ఖర్చు పెట్టగలిగే శక్తి భగవంతుడు తనకు ఇచ్చాడని.. ఎవరైనా ఇందుకు సహకారం అందించడానికి ముందుకు వస్తే స్వీకరిస్తామని చిరు అన్నారు.

ఈసారి తన పుట్టిన రోజును పురస్కరించుకుని ఆసుపత్రి గురించి వివరాలు వెల్లడిస్తున్నానని.. వచ్చే ఏడాది తన పుట్టిన రోజు నాటికి ఈ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయని చిరు తెలిపారు. తాను ఇంత వాడిని కావడానికి కారణమైన కార్మికులు, ప్రేక్షకుల కోసం ఏదైనా చేయాలన్న తలంపుతోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టానని.. ఇప్పుడు ఆసుపత్రిని ఏర్పాటు చేయిస్తున్నానని చిరు వెల్లడించారు. 

This post was last modified on August 20, 2022 3:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మెగా సపోర్ట్ ఏమైనట్లు?

టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…

2 hours ago

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

8 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

11 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

12 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

12 hours ago