Movie News

చరణ్ సినిమా నుంచి అతను ఔట్?

‘ఆర్ఆర్ఆర్’ లాంటి మెగా సక్సెస్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సౌత్ ఇండియన్ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో సినిమా సెట్ చేసుకున్నందుకు అభిమానులు ఎంతగానో సంతోషించారు. శంకర్ ఒకప్పటంత ఫామ్‌లో లేకపోయినా సరే.. తెలుగులో తొలిసారిగా ఆయన దర్శకత్వం వహిస్తున్న సినిమాలో చరణ్ హీరోగా నటించడం పట్ల అభిమానులు గర్వపడుతున్నారు. ఐతే ఈ చిత్ర షూటింగ్‌కు అప్పుడప్పుడూ బ్రేకులు తప్పట్లేదు.

ఇంతకముందు ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్ల కోసం చరణ్ కొన్ని రోజులు బ్రేక్ తీసుకోగా.. మధ్యలో ఆర్ట్ డైరెక్టర్లు రామకృష్ణ, మౌనిక (రంగస్థలం ఫేమ్) తప్పుకోవడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆగింది. వారి స్థానంలో సీనియర్ ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ వచ్చాడు. ఆయన సినిమా కోసం ఒక భారీ యూనివర్శిటీ సెట్ వేశాడు. అందులో కొన్ని రోజులు చిత్రీకరణ జరిగింది. ఇంతలో టాలీవుడ్లో షూటింగ్స్ ఆపేయాలని నిర్మాతలు నిర్ణయించడంతో మళ్లీ బ్రేక్ పడింది.

మరోవైపు శంకర్ మధ్యలో ఆపేసిన ‘ఇండియన్-2’ను పున:ప్రారంభించాల్సిన పరిస్థితి తలెత్తింది. అందుకు సంబంధించిన షెడ్యూళ్లు ఖరారు చేసే పనిలో ఉన్నారాయన. ‘ఇండియన్-2’తో పాటు సమాంతరంగా చరణ్ సినిమాను కూడా చేయాలని శంకర్ అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇంతలో చరణ్ సినిమాకు సంబంధించి మరో ఇబ్బంది తలెత్తింది. ఈ సినిమా నుంచి రవీందర్ సైతం తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.

రామకృష్ణ-మౌనికలకు శంకర్‌తో పడకపోగా.. రవీందర్‌కు నిర్మాత దిల్ రాజు‌తో ఏదో తేడా కొట్టినట్లు చెబుతున్నారు. ఏ విషయంలో విభేదాలు వచ్చాయన్నది తెలియడం లేదు కానీ.. రవీందర్ సైతం ఈ సినిమా నుంచి తప్పుకోవడం మాత్రం వాస్తవమే అంటున్నారు. శంకర్ మళ్లీ అందుబాటులోకి వచ్చేలోపు ఇంకో ప్రొడక్షన్ డిజైనర్‌ను చూసుకుని సెట్స్ అన్నీ రెడీ చేసుకోవాలని చూస్తున్నారు. ఇలా పదే పదే ఆర్ట్ డైరెక్టర్లు మారడంలో వల్ల నిర్మాణ వ్యయం పెరగడంతో పాటు ఔట్ పుట్‌లోనూ తేడా వస్తుందనడంలో సందేహం లేదు.

This post was last modified on August 20, 2022 11:46 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామాయణం అర‌బిక్ ర‌చ‌యితను అభినందించిన మోడీ!

ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ కువైట్‌లో ప‌ర్య‌టిస్తున్నారు. 43 ఏళ్ల త‌ర్వాత‌.. భార‌త ప్ర‌ధాని కువైట్‌లో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం…

1 hour ago

మాస్ సినిమా లకు పోటీ ఇవ్వనున్న క్లాస్ మూవీ?

ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…

9 hours ago

సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న.. ఎవరి తప్పు లేదు : అల్లు అర్జున్‌

పుష్ప‌-2 సినిమా ప్రీరిలీజ్ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద జ‌రిగిన తొక్కిస‌లాట‌ అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌పై శ‌నివారం…

13 hours ago

కేజ్రీవాల్ మ‌రోసారి జైలుకేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌, ఢిల్లీ మాజీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌కు మ‌రో ఉచ్చు బిగుస్తోంది. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో…

13 hours ago

పెళ్లయినా.. కీర్తి తగ్గేదే లే!

కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…

14 hours ago