ఘజని మొహమ్మద్ ఎన్నిసార్లు దండయాత్ర చేశాడో ఖచ్చితంగా చెప్పలేం కానీ డైలాగ్ కింగ్ సాయికుమార్ వారసుడిగా పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఆది మాత్రం హిట్టు కోసం ఏళ్ళ తరబడి పట్టువదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. కెరీర్ ప్రారంభంలో ఓ రెండు మోస్తరు హిట్లు దక్కాయి అంతే. దాని తర్వాత ఒక్కటంటే ఒక్కటి కనీసం యావరేజ్ అయితే ఒట్టు. అయినా కూడా చేతి నిండా సినిమాలతో మోస్ట్ బిజీ హీరోల్లో ఒకడిగా ఉంటున్న ఆది సాయికుమార్ ఈ వారం తీస్ మార్ ఖాన్ గా మాస్ అప్పీల్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
అనాథగా పెరిగిన ఓ కుర్రాడి జీవితంలో తోబుట్టువులా భావించే ఆమె హత్యకు గురవుతుంది. ఎవరు చేశారో కనుక్కునే క్రమంలో హీరో కొన్ని వీరోచిత సాహసాలు చేసి బలవంతులైన శత్రువులను ఎదిరించాల్సి వస్తుంది. చివరికి ఈ కేసుని ఎలా ఛేదించాడు, ఎలా దుర్మార్గుల ఆట కట్టించాడు అనేదే తీస్ మార్ ఖాన్ కథ. ఏ మాత్రం కొత్తదనం లేని రొటీన్ ఫార్ములాలతో చిరంజీవి రవితేజ అంతటి స్టార్లే బాక్సాఫీస్ వద్ద దెబ్బలు తింటుంటే ఏ ధైర్యంతో ఆది సాయికుమార్ తో ఇలాంటి సాహసాలు చేయిస్తున్నారో సదరు దర్శక నిర్మాతలకే తెలియాలి.
తీస్ మార్ ఖాన్ లో ఎలాంటి ప్రత్యేకత లేదు. దర్శకుడు కళ్యాణ్ జి ఎంత అవుట్ డేటెడ్ ప్లాట్ తీసుకున్నప్పటికీ దానికి ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే రాసుకున్నా ఎంతో కొంత బెటర్ అవుట్ ఫుట్ దక్కేది. కానీ అలాంటి ప్రయత్నమేమీ జరగకపోవడంతో పాయల్ రాజ్ పుత్ ఒలికించిన గ్లామర్ తప్ప మాస్ కంటూ ప్రత్యేకంగా ఆకట్టుకునే అంశం ఏదీ లేకపోయింది. ఛాయాగ్రహణం సంగీతం లాంటి సాంకేతిక విభాగాలు సైతం పెద్దగా తోడ్పడలేదు. ఇదే టైటిల్ తో అక్షయ్ కుమార్ 2010లో ఓ హిందీ సినిమా చేశాడు. దాని రిజల్ట్ ఫ్లాప్. ఇప్పుడు ఆ పేరుతో పాటు ఫలితం కూడా రిపీట్ చేశాడు ఆది.
This post was last modified on August 20, 2022 3:16 am
టాలీవుడ్ కు అత్యంత కీలకమైన సంక్రాంతి పండగ అయిపోయింది. నిన్నటితో సెలవులు పూర్తయిపోయాయి. బాక్సాఫీస్ విజేతగా ఒక్క శాతం అనుమానం…
ఇటీవలే ముగిసిన సంక్రాంతి సంబరాల్లో ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కోడి పందేలు జరిగాయి. ఈ పందేలను…
వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొందలేక, పదేళ్ల పాటు అధికారానికి…
సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…