జులై నెల టాలీవుడ్‌కు మామూలు షాకులు ఇవ్వలేదు. జూన్ నెలలో కూడా తొలి వారం తర్వాత శోకాలు తప్ప ఏమీ మిగల్లేదు. జులైలో పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ లాంటి క్రేజీ చిత్రాలు వస్తుండటంతో బాక్సాఫీస్ కళకళలాడుతుందని ఆశించింది టాలీవుడ్. కానీ అందులో ఏ సినిమా కూడా ఒక మాదిరిగా కూడా ఆడలేదు. దేనికీ ఓపెనింగ్స్ రాలేదు. దెబ్బకు టాలీవుడ్ తీవ్ర ఆందోళనలో పడింది. భవిష్యత్తు మీద భయం పట్టుకుని షూటింగ్స్ కూడా ఆపేసి ఇండస్ట్రీని గాడిన పెట్టడానికి ఏం చేయాలా అని చూశారు.
ఐతే ఈ ఆందోళనకు ఆగస్టు తెరదించింది. తొలి వారంలో బింబిసార, సీతారామం ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన రాబట్టుకున్నాయి. ఈ రెండూ అంచనాలను మించి ఆడాయి. ఇంకా ఆడుతూనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఇలాంటి లాంగ్ రన్ చూసింది టాలీవుడ్ బాక్సాఫీస్. ఈ ఉత్సాహాన్ని పెంచుతూ ‘కార్తికేయ-2’ కూడా చాలా బాగా ఆడుతుండటంతో సినీ జనాల ఆనందానికి అవధుల్లేవు.
రెండు వారాల్లో మూడు హిట్లు రావడం అరుదైన విషయం. ఇప్పుడిక ఆగస్టు నెలను ‘లైగర్’ సినిమా మరింత చిరస్మరణీయంగా మారుస్తుందా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. వేసవి తర్వాత తెలుగులో ఏ పెద్ద సినిమా రాలేదు. విజయ్ దేవరకొండను మరీ పెద్ద హీరో అనలేం కానీ.. అతడి స్థాయి చిన్నది మాత్రం కాదు. ‘లైగర్’కు పెద్ద హీరోల సినిమాల స్థాయిలో బజ్ తెప్పించడంలో అతడి పాత్ర కీలకం.
‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరి జగన్నాథ్ తీసిన సినిమా కావడం, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ చిత్రంతో అసోసియేట్ కావడంతో ‘లైగర్’ మీద అంచనాలు పెరిగాయి. దీని ప్రోమోలు మరీ గొప్పగా లేకపోయినా.. మాస్‌లో అయితే సినిమా పట్ల ఆసక్తిని పెంచాయి. విజయ్ తనదైన శైలిలో అగ్రెసివ్ ప్రమోషన్లు చేస్తూ సినిమాకు బజ్ పెంచుతున్నాడు. ‘లైగర్’కు ఓపెనింగ్స్ అయితే అదిరిపోతాయని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయం. అదే జరిగితే నాలుగు హిట్లు ఇచ్చిన అరుదైన నెలగా 2022 ఆగస్టు చరిత్రలో నిలిచిపోతుంది.
This post was last modified on August 19, 2022 10:30 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్‌లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…