Movie News

తిరు టాక్.. ఎలా ఉందంటే?

అసలు ఎలాంటి ప్రమోషన్ చేయకుండా గప్ చుప్ గా విడుదలైన సినిమా తిరు. ధనుష్ హీరో, నిత్య మీనన్ రాశిఖన్నా తెలుగు ఆడియన్స్ కి బాగా పరిచయమున్న హీరోయిన్లు, అన్నిటిని మించి సన్ పిక్చర్స్ నిర్మాణం. అయినా కూడా టైం తగినంత లేకపోవడంతో హడావిడిగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దానికి తగ్గట్టే ఓపెనింగ్స్ డల్ గా ఉన్నాయి. నగరాల్లో మినహాయించి బిసి సెంటర్స్ లో పెద్దగా పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. తమిళనాడులో మాత్రం ఎక్కువ థియేటర్లలో గ్రాండ్ గా చెప్పుకునే రిలీజ్ ఇచ్చారు.

ఇక కంటెంట్ విషయానికి వస్తే ఈ తిరు రొటీన్ డ్రామానే. చదువు సరిగా పూర్తి కాక డెలివరీ బాయ్ గా మారిన ఓ కుర్రాడికి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. క్లోజ్ ఫ్రెండ్ అయిన మరో అమ్మాయితో అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇంట్లోనేమో తండ్రితో మాటలుండవు. తాతయ్యతో మంచి రిలేషన్. ఇలా సాగుతూ ఉండగా లైఫ్ లో రెండు మూడు ట్విస్టులు వచ్చి పడతాయి. వాటిని ఎలా ఎదురుకుని తిరు తన లక్ష్యాన్ని చేరుకున్నాడనేదే స్టోరీ. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ కొత్తగా ఆలోచించలేదు. టైం పాస్ చేయించే టార్గెట్ పెట్టుకున్నాడు.

సింపుల్ ఎమోషన్స్ తో నడిచిన ఈ తిరు ఫస్ట్ హాఫ్ వరకు ఓ మోస్తరుగా పర్లేదనిపించినా రెండో సగంలో తడబాటుతో జస్ట్ యావరేజ్ మెట్టు దగ్గర ఆగిపోయింది. అనిరుద్ రవిచందర్ సంగీతం కూడా అద్భుతాలేం చేయలేదు. జస్ట్ పాస్ అనిపించుకుంది. కాకపోతే ధనుష్ తో పాటు భారతీరాజా, నిత్య మీనన్ లాంటి ఆర్టిస్టుల నటన వీక్ గా ఉన్న కంటెంట్ ని కొంతమేర కాపాడుతూ వచ్చింది. అయితే బింబిసార, కార్తికేయ 2, సీతారామం లాంటి రిచ్ గ్రాండియర్స్ చూసిన తెలుగు జనాల కళ్ళకు తిరులో ఎలాంటి ప్రత్యేకత కనిపించదు. రఘువరన్ బిటెక్ ఛాయలు ఉండటం ఈ సినిమా ప్రత్యేకతను తగ్గించేసింది. ఏ ఆప్షన్ లేకపోతే తిరుని ట్రై చేయొచ్చనేలా ఉన్నాడు. 

This post was last modified on August 18, 2022 7:56 pm

Share

Recent Posts

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

25 minutes ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

2 hours ago

మతిపోగొడుతున్న వారణాసి లెక్కలు

సినిమాలు చూడ్డానికి థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోతోంది.. బయ్యర్ల పెట్టుబడి వెనక్కి రావట్లేదు.. పెడుతున్న బడ్జెట్లకు తగ్గట్లు బిజినెస్…

2 hours ago

కళ్యాణ్ గుండె ధైర్యం గట్టిదే

అక్టోబర్ 9 విడుదల కాబోతున్న కామ్రేడ్ కళ్యాణ్ వెనక్కు తగ్గేలా కనిపించడం లేదు. ఎదురుగా ఆదర్శ కుటుంబం ఏకె 47…

2 hours ago

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

4 hours ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

5 hours ago