బాలీవుడ్లో ఈ మధ్య ఎంత పేరున్న హీరో హీరోయిన్లు నటించినా.. ఎంత మంచి ట్రాక్ రికార్డున్న దర్శకుడు సినిమా తీసినా.. సినిమాలో విషయం ఉన్నా ఈ రోజుల్లో థియేటర్లలో ఆడుతుందన్న గ్యారెంటీ ఉండడం లేదు. దక్షిణాది మాస్ మసాలా ఎంటర్టైన్మెంట్‌కు బాగా రుచి మరిగిన హిందీ ప్రేక్షకులకు తమ సినిమాలను పక్కన పెట్టేస్తున్నారు. ఎప్పుడో ఒక సినిమా మాత్రమే ఆడుతోంది. క్రేజీ కాంబినేషన్లలో తెరకెక్కిన సినిమాలకు, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న చిత్రాలకు కూడా వసూళ్లు ఉండట్లేదు. ఇక టాక్ తేడా కొడితే మాత్రం అంతే సంగతులు.
గత వారాంతంలో విడుదలైన లాల్ సింగ్ చడ్డా, రక్షాబంధన్ లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవాన్ని ఎదుర్కొన్నాయి. ఆయా హీరోల కెరీర్లలో అతి పెద్ద డిజాస్టర్లుగా నిలిచేలా కనిపిస్తున్నాయి. వీటిలో లాల్ సింగ్ చడ్డా టాక్‌తో సంబంధం లేకుండా ఫ్లాప్ అవుతుందని ముందే అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
టాక్ కూడా బాలేకపోవడంతో అనుకున్నదానికంటే పెద్ద డిజాస్టర్ అయింది. ఇక తర్వాతి వారం రాబోయే మరో చిత్రం ఫలితమేంటో కూడా ముందే ఇటు బాక్సాఫీస్ పండిట్లు, అటు ప్రేక్షకులు ఒక అంచనాకు వచ్చేశారు. తాప్సి ప్రధాన పాత్రలో అనురాగ్ కశ్యప్ రూపొందించిన దోబారా ఈ శుక్రవారం థియేటర్లలోకి దిగుతోంది. లిబరల్స్ ముద్ర ఉన్న తాప్సి, అనురాగ్ కలిసి చేసిన ఈ సినిమాను బాయ్‌కాట్ చేయాలని ఆల్రెడీ పిలుపు ఇచ్చేశారు. ట్రెండ్ కూడా నడుస్తోంది.
మామూలుగా కూడా తాప్సి, అనురాగ్‌ల ట్రాక్ రికార్డు ఏమాత్రం బాగా లేదు. ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఇలాంటి ఇంటలిజెంట్ మూవీస్ చూసే మూడ్‌లో లేరు. ఈ టైపు సినిమాలు ఇప్పుడు ఆడే పరిస్థితి లేదు. కాబట్టి అన్నీ నెగెటివ్‌గానే కనిపిస్తుండడంతో దోబారా డిజాస్టర్ కావడం ఖాయమని అంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. దానికి భిన్నంగా సినిమా ఏమైనా అద్భుతాలు చేస్తుందేమో చూడాలి.
This post was last modified on August 18, 2022 1:21 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…