వచ్చే నెల 9న విడుదల కాబోతున్న బ్రహ్మాస్త్ర ప్రమోషన్లు మెల్లగా ఊపందుకుంటున్నాయి. ఇటీవలి బాలీవుడ్ డిజాస్టర్ల దెబ్బకు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తే జనం థియేటర్లకు వస్తారో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఎక్కడ ఏ రూపంలో బాయ్ కాట్ పిలుపులు వినిపిస్తాయోనని భయంతో వణికిపోతున్నారు. అందుకే రిలీజ్ కు కేవలం ఇరవై రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పబ్లిసిటీ హంగామా కనిపించడం లేదు.
దీనికి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ కోసం ఏకంగా మూడు నాలుగు నెలలు నాన్ స్టాప్ గా దేశం మొత్తం తిరిగిన సంగతి తెలిసిందే. సరే ఇంత గ్రాండ్ స్కేల్ లో వస్తున్న మూవీ కాబట్టి దీనికి పోటీతో ఎవరు సాహసం చేస్తారా అనే అనుమానం రావడం సహజం. అయితే అదేం జాన్తానై అంటున్నాయి చిన్న సినిమాలు.
కిరణ్ అబ్బవరం ‘నేను మీకు బాగా కావాల్సిన వాడిని’ తెలిసే అదే తేదీ క్లాష్ కి సిద్దపడుతోంది. ఎస్ఆర్ కళ్యాణమండపం దర్శకుడు శ్రీధర్ గాదె కాంబోతో పాటు ట్రైలర్ బాగానే ఉండటంతో ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. అయితే కిరణ్ గత రెండు డిజాస్టర్లు సెబాస్టియన్, సమ్మతమేల తాలూకు ప్రభావం బిజినెస్ మీదయితే ఉంటుంది.
ఎప్పటి నుంచో వాయిదాల మీద వాయిదాలు తింటున్న సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ ఫైనల్ గా 9కే రావాలని డిసైడ్ అయ్యింది. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీ కన్నడ లవ్ మాక్ టైల్ కి అఫీషియల్ రీమేక్. ఇదే తరహాలో నెలల తరబడి వేచి చూసిన శర్వానంద్ ‘ఒకే ఒక జీవితం’ కూడా ఎట్టకేలకు అదే డేట్ కావాలని నిర్ణయం తీసుకుంది. ఈ లెక్కన చూస్తుంటే బ్రహ్మాస్త్రను ఇవన్నీ లైట్ గా తీసుకున్నట్టే కనిపిస్తోంది. తెలుగులో దాని ఎఫెక్ట్ ఉండదనుకున్నారో లేక ట్రైలర్ చూశాక రిస్క్ చేయొచ్చనే ధీమా తెచ్చుకున్నారో ఇంకో మూడు వారాల్లో తేలిపోనుంది
This post was last modified on August 18, 2022 8:25 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…