అన్ని సార్లు విజయాలు దక్కవు. కొన్ని సార్లు ఆటు పోటు రెండూ వస్తుంటాయి. తాజాగా అగ్ర పంపిణీ దారుడు , నిర్మాత సుధాకర్ రెడ్డి కి ఇదే జరిగింది. హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఎన్నో ఏళ్లుగా సినిమా పంపిణీ రంగంలో ఉన్నారు. చాలా సినిమాలు పంపిణీ చేసి లాభాలు అందుకున్నారు. ‘అఖిల్’ సినిమాతో నిర్మాతగా కొంత నష్టపోయారు. ఇటివలే కమల్ హాసన్ విక్రమ్ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ చేసి మళ్ళీ సక్సెస్ అందుకున్నాడు.
సుధాకర్ రెడ్డి కి ఉన్న అనుభవంతో కమల్ విక్రమ్ తెలుగు డబ్బింగ్ రైట్స్ ని ఆయనకి తక్కువ ధరకి ఇచ్చారు. దీంతో నితిన్ తండ్రికి విక్రమ్ మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఇండస్ట్రీలో ఈ సినిమా లాభాలతో సుధాకర్ రెడ్డి హాట్ టాపిక్ అయ్యాడు. అయితే ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేసే లోపే నిర్మాతగా ఆయనకి మళ్ళీ ఓ ఫెయిల్యూర్ స్ట్రోక్ తగిలింది. నితిన్ హీరోగా రాజ శేఖర్ అనే ఎడిటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఆయన నిర్మించిన ‘మాచర్ల నియోజక వర్గం’ సినిమా మొదటి రోజే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.
మొదటి రోజు ఓపెనింగ్స్ తో ఫరవాలేదనిపించుకున్నా తర్వాత బొత్తిగా డ్రాప్ అయింది. రెండో రోజే నిఖిల్ వచ్చి ‘కార్తికేయ 2’ తో హిట్ కొట్టడంతో వీకెండ్ లో మోస్తారు కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. ఓవరాల్ గా సినిమా ఫ్లాప్ అనిపించుకుంది. సో డిస్ట్రిబ్యూటర్ గా లాభాలు ఆ వెంటనే నిర్మాతగా నష్టాలు అందుకొని రెండిటినీ బ్యాలెన్స్ చేసుకున్నాడు సుధాకర్ రెడ్డి. మరి ఈయనకి మళ్ళీ సక్సెస్ తెచ్చే సినిమా నిర్మాతగానా డిస్ట్రిబ్యూటర్ గానా చూడాలి.
This post was last modified on August 18, 2022 12:15 am
విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…
#AskKavitha- హ్యాష్ ట్యాగ్తో నెటిజన్ల నుంచి అభిప్రాయాలు సేకరించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత.. ఇదే సమయంలో పలువురు నెటిజన్లు…
భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు…
మాటిచ్చిన కేవలం పదిరోజుల్లోనే ఆ హామీని కార్యరూపంలోకి తీసుకువచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. తొమ్మిది రోజుల క్రితం చిలకలూరిపేట…
నటుడిగా చాలా గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ ఈ ఏడాది రెండు సినిమాల్లో విలన్ గా నటించి కంబ్యాక్ అయ్యాడు.…
హర్యానాలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి వై. పూరన్ కుమార్ ఆత్మహత్య ఘటనలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…