పృథ్వీరాజ్ సుకుమారన్.. దక్షిణాదిన తిరుగులేని స్టార్ ఇమేజ్, అలాగే బహుముఖ ప్రజ్ఞ కలిగిన హీరోల్లో అతనొకడు. హీరోగా ఎన్నో విజయాలు, నటుడిగా గొప్ప పేరు సంపాదించిన అతను.. దర్శకుడిగా కూడా సత్తా చాటుకున్నాడు. హీరోగా సినిమాలు చేస్తూనే.. వేరే చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేయడానికి పృథ్వీరాజ్ వెనుకాడడు. ఈ టాలెంటెడ్ యాక్టర్‌ను ప్రభాస్ సినిమా సలార్‌లో విలన్ పాత్రకు తీసుకోవాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ అనుకున్నాడు. పృథ్వీరాజ్ కూడా ఓకే చెప్పాడు.
కానీ కరోనా కారణంగా షెడ్యూళ్లు మారిపోయి పృథ్వీరాజ్ ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కానీ అతను ఈ సినిమాలో ఉండాల్సిందే అని పట్టుబట్టి ప్రభాస్, ప్రశాంత్ అతణ్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. కడువా సినిమా ప్రమోషన్ల కోసం ఆ మధ్య హైదరాబాద్ వచ్చిన పృథ్వీరాజ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు. తాను ప్రశాంత్‌ను కలుస్తున్నానని, ఈ సినిమాలో భాగమయ్యేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు.
తర్వాత సలార్‌లో పృథ్వీరాజ్ ఉన్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ రాలేదు. ఐతే ఈ విషయంపై ఏ ప్రకటన చేయలేదు కానీ.. పృథ్వీరాజ్ ఈ చిత్రంలో నటిస్తున్న విషయాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పాడు. సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తూ చేసిన ట్వీట్లో ప్రశాంత్.. పృథ్వీరాజ్‌ను ట్యాగ్ చేశాడు. కాబట్టి అతను ఈ సినిమాలో భాగం అయినట్లే. ప్రభాస్ వెర్సస్ పృథ్వీరాజ్ పోరు కచ్చితంగా ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలవడం ఖాయం.
తనకు ఆఫర్ చేసిన పాత్ర కూడా అద్భుతం అని పృథ్వీరాజ్ గతంలోనే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ప్రశాంత్.. తమిళ నటి శ్రియ రెడ్డి పేరును కూడా ఈ ట్వీట్లో ట్యాగ్ చేయడం గమనార్హం. ఆమె చేసిన సినిమాలు చాలా తక్కువే కానీ.. ఇంటెన్స్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంది. తాజాగా సుడల్ వెబ్ సిరీస్‌లో శ్రియ అదరగొట్టింది. ఆమె సలార్‌లో నటిస్తోందంటే తన పాత్రా ప్రత్యేకంగానే ఉండొచ్చు. కేజీఎఫ్ నిర్మాతలే ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ కథానాయిక అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on August 17, 2022 8:54 am
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను అమితంగా ఇష్టపడే యంగ్ హీరోల్లో నేచురల్ స్టార్ నాని ఒకడు. అతను సినిమాల్లోకి రాకముందే…
చిన్న ఆర్టిస్టుగా మొదలుపెట్టి సోలో హీరోగా వరస అవకాశాలు చేజిక్కించుకునే దాకా సత్యదేవ్ పడిన కష్టం అంతా ఇంతా కాదు.…
కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో ఘోర పరాభవం ఎదురైనా.. ఆపార్టీ వారసురాలు.. అగ్రనాయకురాలు, ఇందిరమ్మ మనవరాలు.. ప్రియాంక గాంధీ విషయంలో మాత్రం…
ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు…
జైలుకు వెళ్లిన నాయకుల పట్ల ప్రజల్లో సానుభూతి ఉంటుందని చెప్పేందుకు.. మరో ఉదాహరణ జార్ఖండ్. తాజాగా ఇక్కడ జరిగిన ఎన్నికల్లో…