మణిరత్నం లాంటి లెజెండరీ డైరెక్టర్, కోలీవుడ్ లో తలలు పండిన స్టార్లు జూనియర్లు, ఏ ఆర్ రెహమాన్ సంగీతం, రెండు వందల కోట్ల దాకా బడ్జెట్. ఒక ప్యాన్ ఇండియా మూవీకి హైప్ రావడానికి ఇంత కన్నా ఏం కావాలి. కానీ పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 విషయంలో అదేమీ కనిపించడం లేదు. తెలుగు వెర్షన్ అంటే ఏమో అనుకోవచ్చు కానీ అటు తమిళంలోనూ దీని చుట్టూ భీభత్సమైన బజ్ లేదు.
కాకపోతే బాహుబలి రేంజ్ లో అక్కడి మీడియా మోస్తుండటంతో మెల్లగా అంచనాలు పెరుగుతున్నాయి కానీ అవి సరిపోవడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ వెర్షన్ లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇది రెగ్యులర్ గా మనం చూసే స్క్రీన్ ఫార్మాట్ లో ఉందన్న సంగతి తెలిసిందే. గతంలో హైదరాబాద్ ప్రసాద్ లార్జ్ స్క్రీన్ దానికోసమే ఏర్పాటు చేశారు కానీ కాలక్రమేణా ఆ ప్రొజెక్టర్ లో ఏవో ఇష్యూస్ వల్ల సాధారణ ప్రదర్శనలే జరుగుతున్నాయి.
బెంగుళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి నగరాల్లో మాత్రమే ఒరిజినల్ ఐమ్యాక్స్ తెరలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో చూస్తే వచ్చే అనుభూతే వేరు. లైవ్ లో చూస్తున్న ఫీలింగ్ కన్నా చాలా గొప్పగా ఉంటుంది. పొన్నియన్ సెల్వన్ ని ఈ తరహాలో విడుదల చేయడం బాగానే ఉంది కానీ ఇది బిజినెస్ కోణంలో ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి.
విక్రమ్, కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి క్యాస్టింగ్ ఎంత ఉన్నా ట్రేడ్ లోనూ ఆశించిన స్థాయిలో ఆసక్తి కనిపించడం లేదు. సెప్టెంబర్ 30న విడుదల కాబోతున్న ఈ గ్రాండియర్ టైటిల్ ని తెలుగులో సింపుల్ గా పిఎస్ 1 అని పెట్టేసి చేతులు దులుపుకున్నారు కానీ కనీసం మన మాస్ జనానికి అర్థమయ్యేలా ఇక్కడి భాషలో పేరు ఆలోచించలేదు. అయినా దీన్నో ట్రెండ్ గా మార్చేసి అలవాటు చేసుకోమని ఆరవ నిర్మాతలు రుద్దుతుండగా మనం మాత్రం చేసేదేముంది
This post was last modified on August 16, 2022 8:23 pm
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…
మొన్న ఢిల్లీ బస్సులో ఓ అమ్మాయిని రేప్ చేస్తే నేడు హైదరాబాద్ లో ఒకరి తర్వాత మరొకరు, ఎక్కడ దొరికితే…
అక్టోబర్ 15 విడుదల కాబోతున్న జైలర్ 2 బిజినెస్ వ్యవహారాలు ఊపందుకున్నాయి. ఏపీ తెలంగాణ హక్కులు యాభై అయిదు కోట్లకు…
ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్…