Movie News

రౌడీని తప్పుగా అర్థం చేసుకోకండి

విజయ్ దేవరకొండ ఏదైనా వేడుకకు వచ్చినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా, లేదా ప్రమోషనల్ ఈవెంట్‌కు హాజరైనా.. అందరి దృష్టిని తన వైపు తిప్పేసుకుంటాడు. అతడి మాటలు, చేష్టలు ఏదో రకంగా చర్చనీయాంశంగా మారుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని వివాదాలు కూడా అతణ్ని వెంటాడుతుంటాయి. అప్పుడప్పుడూ తన ప్రమేయం లేకుండానే అతను వివాదాల్లో భాగం అయిపోతుంటాడు. తాజాగా విజయ్‌ని కొందరు నెటిజన్లు అనవసరంగా తిట్టడం మొదలుపెట్టారు.

‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్‌లో తెలుగు మీడియాను కలిసిన అతను.. స్టేజ్ మీద కాళ్లు పైకి లేపి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి కూర్చున్నట్లుగా ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది చూసి ప్రెస్ మీట్లో ఇంత యాటిట్యూడా.. జర్నలిస్టులతో ఇలాగేనా మాట్లాడేది.. పబ్లిసిటీ కోసం ఇంత అతి చేయాలా.. అంటూ నెటిజన్లు కొందరు అతడి మీద ఫైర్ అయిపోయారు.

కానీ ఈ ఫొటో వెనుక స్టోరీ వేరే ఉంది. విజయ్ కావాలనేమీ అలా కూర్చోలేదు. యాటిట్యూడ్ చూపించలేదు. ఒక విలేకరి అతడికి ప్రశ్న సంధిస్తూ.. ఒకప్పుడు విజయ్‌‌ను చాలా ఫ్రీగా ప్రశ్నలు అడిగేవాడినని.. కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద స్టార్ అయిపోవడంతో ప్రెస్ మీట్లలో ప్రశ్నలు వేయాలంటే ఇబ్బందిగా ఉందని అన్నాడు.

దీనికి విజయ్ బదులిస్తూ.. ఎందుకంత ఇబ్బంది? అస్సలు మొహమాట పడకండి. చక్కగా కాలు మీద కాలేసుకుని కూర్చోండి, క్యాజువల్‌గా ప్రశ్నలు అడగండి. నేను కూడా ఫ్రీగా కూర్చుంటా అంటూ కాళ్లు తీసి టేబుల్ మీద పెట్టి పిచ్చాపాటీ మాట్లాడుకుంటున్నట్లుగా వాతావరణాన్ని తేలికపరిచే ప్రయత్నం చేశాడు. ఐతే ప్రెస్ మీట్లో మీడియా ముందు ఇలా కూర్చున్న ఫొటో కెమెరాలకు చిక్కడంతో అది సోషల్ మీడియాలో కొన్ని నిమిషాల్లో వైరల్ అయిపోయింది. విషయం తెలియకుండా కొందరు విజయ్‌ని తప్పుగా అర్థం చేసుకుని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. కానీ తర్వాత అసలు వీడియో బయటికి రావడంతో కథ సుఖాంతమైంది.

This post was last modified on August 16, 2022 6:06 pm

Share

Recent Posts

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

4 minutes ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

37 minutes ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

1 hour ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

1 hour ago

నేను చూసిన తెలంగాణ అదే

ద‌స‌రా త‌ర్వాత నేచుర‌ల్ స్టార్ నాని, ద‌ర్శ‌కుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్లో వ‌చ్చిన ది ప్యార‌డైజ్ సినిమా మిశ్ర‌మ స్పంద‌న…

4 hours ago

అనిల్ రావిపూడి అందుకే స్పెషల్

హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…

4 hours ago