వయసు మళ్లిన హీరోలకు కథానాయికలను సెట్ చేయడం ఇప్పుడు చాలా ఇబ్బందికర విషయమే. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్నార్‌ల మాదిరి తమ వయసులో మూడో వంతున్న అమ్మాయిలతో ఏ భేషజం లేకుండా రొమాన్స్ చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రేక్షకులు అలాంటి ఆడ్ పెయిర్స్‌ను యాక్సెప్ట్ చేయట్లేదు. ఒకప్పట్లా సీనియర్ హీరోలు మరీ కుర్రాళ్లలో కొంటె వేషాలు వేస్తూ, వీర లెవెల్లో రొమాన్స్ పండించే పరిస్థితి అయితే లేదు కానీ.. అయినా కూడా వారి పక్కన హీరోయిన్లను సెట్ చేయడంలో తలనొప్పి తప్పట్లేదు.
సూపర్ స్టార్ రజినీకాంత్ గత కొన్నేళ్లలో నయనతార, అనుష్క, త్రిష లాంటి సీనియర్ హీరోయిన్లతోనే జట్టు కడుతూ వచ్చారు. కానీ వీళ్లు క్రమంగా ఆకర్షణ కోల్పోతుండటం, మళ్లీ మళ్లీ వాళ్లతో సినిమా చేయడం కూడా ఇబ్బందికరంగా మారుతుండడంతో కొత్త ఆప్షన్లు వెతుక్కో తప్పట్లేదు. ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కు కొత్త జోడీని వెతుక్కున్నాడట దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.
కోలమావు కోకిల, డాక్టర్ సినిమాలతో మెప్పించి, బీస్ట్ మూవీతో నిరాశ పరిచిన నెల్సన్.. రజినీకాంత్ హీరోగా ‘జైలర్’ అనే సినిమాను రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కథానాయికగా మిల్కీ బ్యూటీ తమన్నా ఓకే అయినట్లు సమాచారం. ఈ మేరకు తమిళ మీడియాలో జోరుగా వార్తలొస్తున్నాయి. దిలీప్ సినిమాల్లో హీరోయిన్లు రెగ్యులర్ టైపులో ఉండరు. హీరో హీరోయిన్ల మధ్య అతను రెగ్యులర్ సీన్లు పెట్టడం.
కథానాయికలను ఫన్నీ రోల్స్‌లో చూపించి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని చూస్తాడు. వాళ్లకు పెర్ఫామెన్స్ చేయడానికి మంచి స్కోపే ఉంటుంది. రజినీ సరసన తమన్నా జోడీ అంటే కొంచెం ఆడ్‌గా అనిపించొచ్చు కానీ.. కథలో ఇమిడిపోయే పాత్ర అయితే వర్కవుట్ కావచ్చు. త్వరలోనే తమన్నాను కథానాయికగా అధికారికంగా ప్రకటించనున్నట్లు సమాచారం. నెల్సన్, రజినీకాంత్‌ల చివరి చిత్రాలను నిర్మించిన సన్ పిక్చర్సే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేయబోతోంది. నెల్సన్ ఆస్థాన సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందరే దీనికీ సంగీతం సమకూర్చబోతున్నాడు.
This post was last modified on August 16, 2022 8:29 am
తెలుగు రాష్ట్రాలు సత్తా చాటుతున్నాయి. వృద్ధి రేటులో ఇప్పటికే గణనీయ వృద్ధిని సాధించిన తెలుగు రాష్ట్రాలు తాజాగా ద్రవ్యోల్బణం (Inflation)…
ఈమధ్య AI టెక్నాలజీతో హాట్ టాపిక్ గా నిలిచిన చైనా టారిఫ్ వార్ తో కూడా అమెరికాతో పోటీ పడడం…
తెలుగులో ఒకప్పుడు వెలుగు వెలిగిన నిర్మాతలు చాలామంది కనుమరుగైపోయారు. కానీ అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి కొద్ది మంది…
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…