ఆగస్ట్ నెల సగం పూర్తయ్యింది. జూలై మొత్తం అయిదు డిజాస్టర్లతో తీవ్ర నిరాశగా గడిపిన టాలీవుడ్ కు బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్లు కొత్త ఊపిరినిచ్చాయి. బింబిసార, సీతారామం, కార్తికేయ 2లు ఒకదాన్ని మించి మరొకటి జనాన్ని థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ కావడంతో డిస్ట్రిబ్యూటర్ల మొహంలో ఆనందం కనిపిస్తోంది. మాచర్ల నియోజకవర్గం నిరాశపరిచినప్పటికీ మొత్తంగా చూసుకుంటే ఏ భాషలో లేని శుభపరిణామాలు మన పరిశ్రమలోనే చోటు చేసుకున్నాయి. బాలీవుడ్ కు సైతం సాధ్యం కాని స్థాయిలో జరిగిన అద్భుతాలివి.
ఇక రాబోయే శుక్రవారం చెప్పుకోదగ్గ రిలీజులు లేవు. వాంటెడ్ పండుగాడ్ లాంటి చిన్న చిత్రాలేవో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి కానీ చాలా బాగుందనే మౌత్ టాక్ వస్తేనే బాక్సాఫీస్ వద్ద కొంతయినా నిలదొక్కుకుంటాయి. ఆపై 25న వచ్చే లైగర్ మీద ఇప్పుడందరి చూపు నిలుస్తోంది. ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కు ప్లాన్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్ల కోసం గత రెండు మూడు వారాలుగా టీమ్ విమానాలు వేసుకుని మరీ తిరుగుతూనే ఉంది. నిన్న వరంగల్ లో ఓ ఈవెంట్ చేసి ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు.
నార్త్ లో విజయ్ దేవరకొండకు మంచి గుర్తింపు ఫాలోయింగ్ ఉందనే క్లారిటీ తనను రిసీవ్ చేసుకున్న తీరుని బట్టి అర్థమైపోయింది. సో ఇప్పుడు మిగిలింది కంటెంట్ తో మెప్పించడం. ఇది పక్కా తెలుగు సినిమాని దేశవ్యాప్తంగా చూపిస్తామని విజయ్ దేవరకొండ నొక్కి చెబుతున్నాడు. ఆగ్ లగా దేంగే అని పూరి ఛార్మీ పదే పదే పలవరిస్తున్నారు. దీనికి తగ్గట్టు కనక సినిమా ఉంటే మాత్రం ఆగస్ట్ కి గ్రాండ్ క్లోజింగ్ దక్కుతుంది. అసలే రౌడీ హీరో మార్కెట్ కి మించి భారీ ఎత్తున పెట్టుబడులు జరిగిన ఈ బాక్సింగ్ డ్రామా మీద ఇప్పటికి భీకరమైన హైప్ లేదు కానీ మంచి మాస్ యాక్షన్ మూవీ అనే అంచనాలైతే అభిమానుల్లో గట్టిగా ఉన్నాయి
This post was last modified on August 15, 2022 10:46 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…