ఆశించిన దానికన్నా పెద్ద స్థాయిలో కార్తికేయ 2 బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా చాలా తక్కువ స్క్రీన్లు దక్కిన నార్త్ బెల్ట్ లో ఇవాళ్టి నుంచే థియేటర్లను పెంచారు. శనివారం అరవైతో మొదలై ఇప్పుడు మూడు వందలకు చేరువగా ఉంది. పందొమ్మిదో తేదీ నుంచి ఇదింకా డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి ఆ స్థానంలో కార్తికేయ 2 హిందీ వెర్షన్ ని వేయబోతున్నారు. ముంబై, ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్, గుర్గావ్ లాంటి నగరాల్లో బుకింగ్స్ చాలా బాగుంటున్నాయి.
దీని సంగతలా ఉంచితే ఇందులో కేవలం పది నిమిషాలలోపే ఉన్న కీలకమైన ప్రొఫెసర్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ నటులు అనుపమ్ ఖేర్ కృష్ణుడి గొప్పదనం గురించి వర్ణించే సీన్ ఓ రేంజ్ లో పేలిన సంగతి తెలిసిందే. తర్వాత ఆయన కనిపించకపోయినా దాని తాలూకు ఇంపాక్ట్ క్లైమాక్స్ దాకా అలా ఉండిపోయింది. సోషల్ మీడియా మీమర్స్ కూడా ఈ క్యారెక్టర్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో హిందూ సెంటిమెంట్ తో ఊగిపోతున్న ఉత్తరాది ప్రేక్షకులకు కృష్ణతత్వాన్ని అనుపమ్ ఖేర్ తో చెప్పించడంతో వాళ్లకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది.
నిజానికి ఇంత చిన్న వేషానికి ఎలా ఒప్పుకున్నారన్న సందేహం లేకపోలేదు. దానికి కారణం ఉంది. కార్తికేయ 2 నిర్మాత అబిషేక్ పిక్చర్సే ఆ మధ్య వచ్చిన బ్లాక్ బస్టర్ ది కాశ్మీర్ ఫైల్స్ ప్రొడ్యూసర్. అందులో అనుపమ్ ఖేర్ ఎంత గొప్ప పెర్ఫార్మన్స్ ఇచ్చారో ఎవరూ మర్చిపోలేరు. అది నిర్మాణంలో ఉన్నప్పుడే అభిషేక్ అగర్వాల్ కార్తికేయ 2 గురించి పెద్దాయనకు చెప్పడం, అందులోనూ దైవత్వం టచ్ ఉన్న సీన్ కావడంతో ఇంకేం ఆలోచించకుండా ఓకే చెప్పేశారు. దీని తర్వాత ఎక్కువ లెన్త్ ఉన్న రోల్ ని ప్రభాస్ ప్రాజెక్ట్ కె లో చేస్తున్నారు
This post was last modified on August 15, 2022 10:23 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…