విజయ్ దేవరకొండ తో పూరి ‘లైగర్’ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ సినిమాకు అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కి లింకేసి పూరి మళ్లీ అదే తీస్తున్నాడా అనే సందేహాలు ప్రేక్షకుల్లో మొదలయ్యాయి. అమ్మ సెంటిమెంట్, స్పోర్ట్ మిక్స్ చేసిన థీమ్ ఒకే విధంగా అనిపిస్తుండటంతో అందరిలో ఈ డౌట్ రైజ్ అవుతుంది.
తాజాగా హీరో విజయ్ దేవరకొండ కి కూడా ఇదే ప్రశ్న మీడియా నుండి ఎదురైంది. అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి కి ఈ సినిమా అప్ గ్రేడ్ వర్షన్ అనుకోవచ్చా ? అని అడగ్గానే విజయ్ కూల్ గా రియాక్ట్ అయ్యాడు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి ఇప్పుడు మళ్లీ సేమ్ తీసినా హిట్ అవుతుందని అసలు భయమే అక్కర్లేదని కానీ లైగర్ కి ఆ సినిమాకి ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
అమ్మ- కొడుకుల ఎమోషన్ వల్ల అలా అనిపించొచ్చు తప్ప మిగతా కథంతా వేరుగా ఉంటుందని తెలిపాడు. అలాగే ఇందులో తాము కిక్ బాక్సింగ్ తీసుకోలేదని, మార్షల్ ఆర్ట్స్ చూపించామని ఇది వేరే సినిమా, అయినా నేనెందుకు ఆ సినిమా రీమేక్ చేస్తాను నాకసలు రీమేక్ అంటే నచ్చదు అంటూ క్లారిటీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ.
ఇక లైగర్ ప్రమోషన్స్ కి వచ్చేసరికి తన బాడీ సహకరించడం లేదని, అయినా మెంటల్ గా సంతోషంగా ఉన్నానని అన్నాడు. ఒక వారం బాడీ కి రెస్ట్ ఇస్తే మళ్లీ సెట్ అవుతుందని, కానీ రెండేళ్లు కష్టపడిన సినిమా కోసం రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్స్ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నాడు. ఏదేమైనా పూరి అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథకు ఇంకో వర్షన్ లో రాసి ‘లైగర్’ తీసినట్టే అనిపిస్తుంది. మరి రిలీజ్ తర్వాత ఆడియన్స్ డౌటే నిజమవుతుందా ? లేదా విజయ్ చెప్పినట్టు దానికి దీనికి ఏ మాత్రం సంబంధం ఉండదా ? చూడాలి.
This post was last modified on August 15, 2022 10:04 pm
బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలపై…
వైసీపీ తీరు మారలేదు. ఒకవైపు.. ఇండియా కూటమిలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్టు ఆ పార్టీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు…
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…