టాలీవుడ్లో సెంటిమెంట్స్ ఎక్కువ. ఫలానా హిట్ సినిమా రిలీజ్ రోజే తమ మూవీ కూడా రిలీజ్ చేయాలని చాలా మంది హీరోలు, దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. ఫ్యాన్స్ లో కూడా అలాంటి సెంటిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ ప్రభాస్ కొత్త సినిమా సలార్ కి మాత్రం రివర్స్ లో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉన్న డేట్ ఎంచుకోవడం ఇప్పుడు ఫ్యాన్స్ లో టెన్షన్ పెంచుతుంది.
సలార్ అప్డేట్ కోసం కొన్ని నెలలుగా తీవ్రంగా ఎదురుచూస్తున్నారు రెబల్ ఫ్యాన్స్. వారికోసం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త అప్ డేట్ వదిలారు మేకర్స్. టీజర్ రిలీజ్ డేట్ చెప్తారని ఎదురుచూసిన ఫ్యాన్స్ కి రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు మేకర్స్.
ప్రస్తుతం షూటింగ్ స్టేజిలో ఉన్న ఈ సినిమాను సెప్టెంబర్ 28న 2023 లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ ఈ రిలీజ్ డేట్ ప్రభాస్ కి, ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ సెంటిమెంట్ అని చెప్పాలి. అవును 2012 లో ఇదే డేట్ కి ప్రభాస్ ‘ రెబల్ ‘ రిలీజైంది. లారెన్స్ డైరెక్షన్ లో వచ్చిన ఆ సినిమా ఫ్యాన్స్ ని నిరాశపరిచి ప్రభాస్ గ్రాఫ్ అమాంతంగా కిందకి పడేసింది.
అందుకే ఇన్నేళ్లకి మళ్లీ అదే డేట్ కి ఎన్నో అంచనాలు పెట్టుకున్న సలార్ ని రిలీజ్ చేయబోతుండటం ఫ్యాన్స్ లో భయం సృష్టిస్తుంది. అసలే ‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నుండి సాలిడ్ హిట్ రాలేదు. సాహో , రాధేశ్యామ్ రెండూ బోల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో సలార్ పై ఆశలు పెట్టుకున్న ఫ్యాన్స్ ని రిలీజ్ డేట్ మాత్రం భయపెడుతూ పాత గాయాన్ని గుర్తుచేసింది.
This post was last modified on August 15, 2022 3:43 pm
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…
జనవరి 9 డేట్ మీద ప్రభాస్, విజయ్ అభిమానులు యమా ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నారు. రాజా సాబ్,…
బ్లాక్ బస్టర్ సీక్వెల్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన అఖండ తాండవం 2 మొదటి మూడు రోజులు మంచి వసూళ్లే రాబట్టినా,…
డిసెంబరు బాక్సాఫీస్కు వాయిదా నెలగా మారిపోయింది. ఈ నెలకు వివిధ భాషల్లో షెడ్యూల్ అయిన సినిమాలు ఒక్కొక్కటిగా వాయిదా పడడం…