Movie News

ఆ ఫార్ములా వదిలేయండి బాసూ

అనగనగా ఒక నగరం లేదా పట్టణం. అక్కడో పెద్ద రౌడీ. ఆ సిటీ లేదా టౌన్ మొత్తం అతడి గుప్పెట్లో ఉంటుంది. అతను ఏం చెబితే అదే వేదం. అతణ్ని చూస్తే జనానికి హడల్. అలాంటి టైంలో హీరో అక్కడ అడుగు పెడతాడు. విలన్‌కు ఎదురెళ్తాడు. నేనెవరో తెలుసా అంటూ విలన్ హుంకరిస్తాడు. నువ్వు ఎవడైతే నాకేంటి అని హీరో తొడ కొడతాడు. అక్కడి నుంచి డిష్యు డిష్యుం.. చివరికి హీరోదే పైచేయి. దశాబ్దాల నుంచి తెలుగు మాస్ మసాలా సినిమాల్లో చూస్తున్న ఫార్ములానే ఇది.

ఒక సినిమాలో హీరో సామాన్యుడిలా ఉంటాడు. ఇంకో సినిమాలో పోలీస్ అవతారం ఎత్తుతాడు. మరో సినిమాలో ఇంకేదో పని చేస్తుంటాడు. కానీ ఫార్ములా మాత్రం ఒకటే. ఈ లైన్లో పదులు కాదు.. వందల్లో సినిమాలు వచ్చాయి. ఈ ఫార్ములా పూర్తిగా ఔట్ డేట్ అయిపోయినా.. టాలీవుడ్ డైరెక్టర్లు మాత్రం దాన్ని వదిలిపెట్టట్లేదు. ఈ కథనే కొంచెం అటు ఇటు మార్చి, హీరోలకు కొత్త క్యారెక్టర్లు తగిలించి జనం మీదికి వదులుతూనే ఉన్నారు. గత నెలలో వచ్చిన ‘ది వారియర్’ కథ దాదాపు ఇదే లైన్లో ఉంటుంది. కాకపోతే అందులో హీరోను నేరుగా పోలీస్‌గా చూపించకుండా.. ముందు డాక్టర్‌గా చూపించి, ఆ తర్వాత పోలీస్ అవతారం ఎత్తించారు.

ఇక తాజాగా రిలీజైన ‘మాచర్ల నియోజకవర్గం’ లైన్ కూడా ఇలాగే ఉంటుంది. ఇందులో హీరో కలెక్టర్ పాత్ర చేశాడు. పేరుకే కలెక్టర్ తప్ప అతను చూపించేదంతా మాస్ హీరోయిజమే. కలెక్టర్ కావడం వల్ల ఆ పాత్రకు చేకూరిన ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం రెండింట్లోనూ కొత్తదనం రవ్వంతైనా కనిపించదు. ఒక్క సీన్ కూడా కొత్తగా అనిపించదు. అందులోనూ ‘మాచర్ల నియోజకవర్గం’ అయితే మరీ ముతకగా అనిపిస్తుంది.

ఎన్నో సినిమాలకు ఎడిటర్‌గా పని చేసి ఈ చిత్రంతో దర్శకుడిగా మారిన ఎం.ఎస్.రాజశేఖర్ రెడ్డి.. తన అనుభవంలో ఏం నేర్చుకున్నాడో ఏంటో అర్థం కాని విషయం. తాను ఎడిటింగ్ చేసిన సినిమాలు చూసి స్ఫూర్తి పొంది.. వాటిలోని సీన్లనే రిపీట్ చేసినట్లు అనిపిస్తుంది తప్ప రవ్వంతైనా క్రియేటివిటీ కనిపించలేదు. ఇంతకుముందైతే ‘మాస్’ పేరు చెప్పి చూసిన సినిమాలనే తిప్పి తిప్పి చూపిస్తుంటే ప్రేక్షకులు ఆదరించేవారు కానీ.. ఇప్పుడు చాలా సెలక్టివ్‌గా సినిమాలు చూస్తున్న ఆడియన్స్ ఇలాంటి ఫార్ములా సినిమాలను తిప్పి కొడుతున్నారు. కాబట్టి ఇకనైనా ఈ టెంప్లేట్ సినిమాలకు తెరదించితే బెటర్.

This post was last modified on August 15, 2022 8:42 am

Share

Recent Posts

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

1 hour ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

1 hour ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

2 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

3 hours ago

విశాఖ‌, విజ‌య‌వాడ‌, తిరుప‌తి… ఈ మూడే కూట‌మికి కీల‌కం!

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూట‌మికి కీల‌కంగా మారిన మూడు మునిసిప‌ల్‌ కార్పొరేష‌న్ల వ్య‌వ‌హారం.. ఆస‌క్తిగా మారింది. రాజ‌కీయ వ‌ర్గాల్లోనే కాదు..…

4 hours ago

ఏఐతో 100 కోట్ల ప్రాణాలకు ముప్పు?

సాంకేతిక రంగంలో పెను విప్లవానికి దారి తీస్తున్న ఏఐ ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాకముందే ప్రపంచాన్ని హడలెత్తిస్తుంది. అణ్వాయుధాల కంటే…

4 hours ago