ఇన్నేళ్ల భారతీయ సినీ చరిత్రలో బాలీవుడ్ ఇప్పుడు ఎదుర్కొంటున్న సంక్షోభం ఎన్నడూ ఎదుర్కోలేదు. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనేంతగా ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని సినిమాల క్వాలిటీ, కలెక్షన్లు, రికార్డులు, మార్కెట్, అవార్డులు.. ఇలా ఏ రకంగా చూసుకున్నా మిగతా ఇండస్ట్రీల మీద పూర్తి పైచేయి చలాయిస్తూ దశాబ్దాలుగా టాప్‌లో ఉన్న బాలీవుడ్.. ఇప్పుడు రీజనల్ ఫిలిం ఇండస్ట్రీల ముందు నిలవలేకపోతోంది. ముఖ్యంగా తెలుగు సినిమాలు దేశాన్ని ఊపేస్తూ ప్రపంచ స్థాయిలో గుర్తింపు సంపాదిస్తూ వందలు వేల కోట్ల వసూళ్లు రాబడుతుంటే.. హిందీ చిత్రాలు అన్ని రకాలుగా చతికిలపడుతున్నాయి.
ఒకప్పుడు కేక్ వాక్ లాగా ఉన్న వంద కోట్ల వసూళ్లు ఇప్పుడు అందని ద్రాక్షలా మారిపోయాయి బాలీవుడ్ సినిమాలకు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా తొలి రోజు పది కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం కష్టం అయిపోతోంది. సినిమా రిలీజై అందులో విషయం లేకపోవడం వల్ల ఫ్లాప్ అయితే ఓకే అనుకోవచ్చు. కానీ విడుదలకు ముందే సినిమా ఫలితం నిర్ణయం అయిపోతోంది. సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు అదే పనిగా హిందీ చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేయడం.. రోజులు వారాల తరబడి నెగెటివిటీని స్ప్రెడ్ చేసి సినిమాలను కిల్ చేస్తుండటం ఆందోళనకరంగా మారుతోంది.
అసలే కొవిడ్ దెబ్బకు అల్లాడిపోయిన బాలీవుడ్‌కు ఈ ‘బాయ్‌కాట్’ నినాదాలు శరాఘాతంలా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కొంతమంది నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తే ఏం జరుగుతుంది.. దాని వల్ల సినిమాలు ఆడకుండా పోతాయా అని తేలిగ్గా తీసుకున్న వాళ్లు ‘లాల్ సింగ్ చడ్డా’కు వచ్చిన ఓపెనింగ్స్, నెగెటివ్ టాక్ వైల్డ్ ఫైర్ లాగా విస్తరించిన వైనం చూసి అవాక్కవుతున్నారు. ఆమిర్ సినిమాలకు ఒకప్పుడు టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఇండియాలో రూ.25-30 కోట్ల మినిమం వసూళ్లు వచ్చేవి.
అలాంటిది ‘లాల్ సింగ్ చడ్డా’కు రూ.12 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రావడం.. తొలి రోజు జనాలు లేక 1300 షోలు క్యాన్సిల్ కావడం విస్మయం కలిగిస్తోంది. ఇదంతా బాయ్‌కాట్ నినాదాల ఫలితం అన్నది స్పష్టం. ఇకపై ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేదు. బాలీవుడ్ దీనిపై ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టడం.. తమ పరిస్థితిని జనాలకు వివరించే ప్రయత్నం చేయడం.. తమలో హిందూ వ్యతిరేక భావజాలం లేదని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అందులో ఏ బాలీవుడ్ ప్రముఖుల పాత్ర లేదని వివరించడం.. ఒక సినిమా వెనుక ఉండే కష్టం, దాని మీద ఆధారపడ్డ కుటుంబాల గురించి ఆవేదన భరితంగా చెప్పే ప్రయత్నం చేయడం చాలా అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
This post was last modified on August 14, 2022 4:21 pm
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఫ్యాన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వనప్పటికీ…
ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబోలో రూపొందబోయే ప్యాన్ ఇండియా మూవీ మీద…
కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం తో కాంగ్రెస్ దోస్తీ…
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్‌ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…