ఇటీవలే విడుదలైన లాల్ సింగ్ చడ్డా, రక్షా బంధన్ డిజాస్టర్ల దెబ్బకు బాలీవుడ్ కకాలవికలమైపోయింది. సమస్య కంటెంట్ లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా బాయ్ కాట్ నినాదాలు అమీర్ ఖాన్ మూవీ మీద బలంగా ప్రభావం చూపించిన మాట వాస్తవం. లేకపోతే కనీసం మొదటి రోజైనా చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ దక్కేవి. అదీ జరగలేదంటే ప్రేక్షకుల్లో అతని పట్ల బలమైన వ్యతిరేకతే కారణం. ఇప్పుడు నెక్స్ట్ లిస్టులో ఉన్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ. సెప్టెంబర్ 9 విడుదలకు ముస్తాబవుతున్న విజువల్ గ్రాండియర్ ఇది.
దీనికీ నిరాసన సెగలు తప్పడం లేదు. ఇందులో హీరోగా నటించిన రన్బీర్ కపూర్ పాత్రకు ముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ని అనుకున్నారట. కానీ నిర్మాత కరణ్ జోహార్ ప్రోద్బలంతో పేరు మారిపోయిందని, ఇలాంటి పెద్ద అవకాశం కోల్పోవడం సుశాంత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించిన కారణాల్లో ఒకటని ఒక వర్గం నెటిజెన్లు గట్టిగా ప్రచారం చేస్తున్నారు. దీనికి ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ఫేస్ బుక్, ట్విట్టర్స్ లో ఇది వైరల్ అవుతోంది. బ్రహ్మాస్త్రను కూడా చూడకూడదని పిలుపునిస్తూ పోస్టులు ట్వీట్ లు చేస్తున్నారు
ఇదంతా ఎలా ఉన్నా సినిమాలో మ్యాటర్ ఉంటే ఇవేవీ పనిచేయవు కానీ అసలు ఫస్ట్ డే ఫస్ట్ షోకు జనాలను రప్పించడమే హిందీనిర్మాతలకు పెద్ద సవాల్ గా మారింది. బాగుందంటే ఎలాగూ అది పబ్లిక్ టాక్ రూపంలో బయటికి వెళ్తుంది. అసలు థియేటర్ దాకా రాకపోతేనే కదా అసలు సమస్య. ఇంకో రెండు భాగాలు ప్లానింగ్ లో ఉన్న బ్రహ్మాస్త్రలో నాగార్జున, అమితాబ్ బచ్చన్ లాంటి బలమైన క్యాస్టింగ్ ఉంది. ఆర్ఆర్ఆర్ తరహాలో ప్రమోషన్లు చేయకపోవడం దీనికి ఇబ్బంది కలిగించేలా ఉంది. ఇప్పటికైనా మేల్కొని ఆ పబ్లిసిటీ మీద ఫోకస్ పెట్టడం చాలా అవసరం
This post was last modified on August 14, 2022 4:06 pm
అమెరికా ప్రభుత్వం అక్రమంగా ఉన్న 104 మంది భారతీయులను దేశం నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. పంజాబ్లోని అమృత్సర్కు ప్రత్యేక…
ఆస్ట్రేలియా జట్టు ఈసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో స్ట్రాంగ్ టీమ్ గా రాబోతోంది అనుకుంటున్న టైమ్ లో ఊహించని పరిణామాలు…
ఏప్రిల్ 10 ది రాజా సాబ్ రావడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే అయినా టీమ్ ఇప్పటిదాకా ఆ విషయాన్ని…
ఇరవై రెండు సంవత్సరాల క్రితం రిలీజైన జానీ ఇప్పటి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక కల్ట్ లా ఫీలవుతారేమో కానీ…
ఆరాధన సినిమాలో పులిరాజు పాత్ర పోషించిన చిరంజీవి ఎక్స్ ప్రెషన్ ని తన ఆఫీస్ లో ఫోటో ఫ్రేమ్ గా…
అనూహ్యంగా చోటు చేసుకున్న ప్రమాదానికి గురైన భర్తను కాపాడుకునేందుకు ఒక ఇల్లాలు చేసిన ప్రయత్నం అందరిని ఆకర్షిస్తోంది. ఈ ఉదంతం…