సబ్జెక్టు బాగా రాలేదనే కారణంతోనో లేదా ఇంకా ప్లానింగ్ పూర్తవ్వలేదనే వంకతోనో స్టార్ హీరోలు కొత్త సినిమాల షూటింగులు మరీ ఎక్కువ జాప్యం చేయడం అభిమానులకు అసంతృప్తి కలిగిస్తుందేమో కానీ పరిశ్రమకు సంబంధించి ఎందరికో ఉపాధిని ఆలస్యం చేస్తుంది. దాదాపు అందరూ ఆయా ప్రాజెక్టుల్లో బిజీగా ఉండగా ముగ్గురు టాప్ స్టార్స్ మాత్రం ఇంకా రంగంలోకి దిగలేదు. అందులో మొదటి పేరు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. దర్శకుడు సుకుమార్ పుష్ప 2 స్క్రిప్ట్ ని చెక్కుతూనే ఉన్నారు తప్ప ఎప్పుడు స్టార్ట్ చేస్తారో మాత్రం మైత్రి మేకర్స్ అప్ డేట్ ఇవ్వడం లేదు.
దీనికే ఇంకో ఏడాది పడితే బన్నీ నెక్స్ట్ మూవీ ఏ 2024 చివరిలో రిలీజ్ అవుతుంది. పైగా ఎవరితో చేయాలనే క్లారిటీ కూడా పుష్ప ఆలస్యం వల్లే రావడం లేదు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ ఎదురు చూసే కొద్దీ పట్టాలెక్కడంలో లేట్ చేస్తూనే ఉంది. ఆచార్య తాలూకు తలనెప్పులు కొరటాలకు దాదాపు తీరిపోయాయి. మరి తారక్ పని మీదే ఉన్నాడా లేక ఫైనల్ వెర్షన్ ని సిద్ధం చేశాడా అనేది ఆ ఇద్దరికీ మాత్రమే తెలిసిన రహస్యం. ఇక మహేష్ బాబు విదేశాల నుంచి ఇండియాకు తిరిగి వచ్చినా త్రివిక్రమ్ టీమ్ సైలెంట్ గానే ఉంది.
బహుశా సెప్టెంబర్ నుంచి మొదలుపెట్టే అవకాశాలున్నాయి. ఏది ఏమైనా ఈ ముగ్గురు సెట్స్ లో అడుగు పెట్టి ఆరు నెలలు పైనే అయ్యింది. ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక తారక్, బన్నీలు ఎక్కువ జాగ్రత్తగా ఉండగా మహేష్ మాత్రం ఎప్పటిలాగే హడావిడికి దూరంగా ఏడాదికి ఒకటే చాలనుకుంటున్నాడు. అయితే ఫ్యాన్స్ మాత్రం రాజమౌళికి రెండు మూడేళ్లు వెళ్లిపోతాయి కాబట్టి ఆలోగా ఇంకో క్రేజీ కాంబో ఒకటి చేసేయమని అడుగుతున్నారు. మొత్తానికి ఆ త్రీ స్టార్స్ షూటింగుల కోసం అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు
This post was last modified on August 13, 2022 1:08 am
తెలుగు ప్రేక్షకుల సినిమా ప్రేమ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సినిమా కాస్త పర్లేదంటే థియేటర్లకు వరుస కట్టేస్తారు.…
ఒక యంగ్ హీరో ఇంకో ఇంకో యంగ్ హీరోను పెట్టి సినిమా ప్రొడ్యూస్ చేయడం అరుదు. నేచురల్ స్టార్ నాని…
కోన వెంకట్ ఒకప్పుడు తెలుగు ప్రేక్షకులు ఎంతో మెచ్చిన రైటర్. ఢీ, రెడీ, కింగ్, దూకుడు, అదుర్స్.. ఇలా ఎన్నో…
రాజకీయాల్లో ఉన్నవారు.. ఒకవైపే చూస్తామంటే కుదురుతుందా? ఒక వైపు ఆలోచన చేస్తామంటే కుదురుతుందా? అంటే కాదన్నది అందరికీ తెలిసిందే. కానీ,…
పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…
అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…