కమల్ హాసన్ లోకేష్ కనగారాజ్ తీసిన ‘విక్రమ్’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. తమిళ్ లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ కలెక్షన్స్ తో సినిమా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో హీరో నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఆయనకున్న అనుభవంతో కమల్ తక్కువ రేటుకే తెలుగు డబ్బింగ్ రైట్స్ ఇచ్చారు. ఇక ఎవరూ ఊహించని విధంగా సుధాకర్ రెడ్డికి విక్రమ్ భారీ లాభాలు తెచ్చిపెట్టింది. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్ ఏర్పాటు చేసి కమల్ ని కూడా ఆహ్వానించారు సుధాకర్ రెడ్డి.
ఇక విక్రమ్ కి సంబంధించి అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ హైలైట్ అని చెప్పాలి. ఆ స్కోర్ సినిమా రిలీజ్ తర్వాత బాగా పాపులర్ అయింది. విక్రమ్ అంటూ వచ్చే ట్రాక్ సోషల్ మీడియాని షేక్ చేసేసింది. అందుకే విక్రమ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని తన సినిమాలో వాడేసుకున్నాడు నితిన్. తన బేనర్ లో రిలీజై మంచి సక్సెస్ అయిన సినిమా కావడంతో తాజాగా ‘మాచర్ల నియోజిక వర్గం’ లో నితిన్ ఎలివేషన్ కి ఆ టైటిల్ ట్రాక్ వాడుకున్నారు.
అయితే కమల్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేందుకు విక్రమ్ అంటూ అనిరుద్ ఇచ్చిన స్కోర్ అక్కడ బాగా హెల్ప్ అయింది. కానీ మాచర్ల లో అది బెడిసి కొట్టింది. ఆ స్కోర్ తో నితిన్ నడిచే సీన్ కేవలం అతని అభిమానులను మాత్రమే మెప్పిస్తుంది తప్ప మిగతా ఆడియన్స్ కి ఎక్కదు. పైగా జస్ట్ విలన్ కి వార్నింగ్ ఇచ్చి నితిన్ వెనక్కి తిరిగి నడిచే సీన్ కి ఈ స్కోర్ వాడారు. కానీ అనిరుద్ స్కోర్ తో ఎలివేట్ అయ్యే సీన్ అక్కడ పడలేదు. ఇక మాచర్ల నియిజిక వర్గం నితిన్ సొంత సినిమానే కాబట్టి దర్శకుడో లేదా ఇంకెవరో విక్రమ్ ట్రాక్ కి వాడుకుందాం అనే ఐడియా ఇచ్చి ఉండొచ్చు. దానికి నితిన్ , సుధాకర్ రెడ్డి ఇంప్రెస్ అయ్యి ఉండొచ్చు అంతే.