ఆమిర్ ఖాన్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పాత్రలో కొంచెం విషయం ఉంటే.. దాన్ని తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లగల నైపుణ్యం అతడి సొంతం. లగాన్, త్రీ ఇడియట్స్, పీకే, దంగల్ లాంటి చిత్రాల్లో అతడి నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమిర్‌లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే.. తాను గొప్ప నటుడిని అని చాటుకోవడానికి అతను అతి ఏమీ చేయడు. హద్దులు దాటి నటించడు. పాత్రకు తగ్గట్లుగా కొలిచినట్లు నటించడం అతడి ప్రత్యేకత. అతను ఎక్కువమందికి చేరువ అయితే ఈ తరహా నటనతోనే.
అలాంటి మేటి నటుడు ఇప్పుడు ఒక పాత్రతో తనకున్న పేరును చెడగొట్టేసుకున్నాడు. ఆ క్యారెక్టర్.. లాల్ సింగ్ చడ్డా అని చెప్పడానికి సందేహించాల్సిన పని లేదు. హాలీవుడ్ క్లాసిక్ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఆమిర్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ గురువారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు విడుదల ముంగిట ఉన్న నెగెటివిటీ చాలదని.. టాక్ కూడా చాలా బ్యాడ్‌గా వచ్చింది.
మామూలుగా తన సినిమాలకు ఆమిర్ పెద్ద బలం అవుతుంటాడు. సినిమా ఎలా ఉన్నా కూడా అతడి పాత్ర, నటన మెప్పిస్తుంటాయి. ‘లాల్ సింగ్ చడ్డా’ మాత్రం ఇందుకు మినహాయింపు. ఈ సినిమాకు పెద్ద మైనస్సే ఆమిర్ అంటే ఆయన అభిమానులు ఫీలవ్వాల్సిన పని లేదు. ఒరిజినల్లో టామ్ హాంక్స్ పాత్ర చేయడానికి ఆమిర్‌ను మించిన ఆప్షన్ లేదని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. ఐతే ఉన్నదున్నట్లుగా ఈ పాత్రను చేస్తే టామ్ హాంక్స్‌ను అనుకరించినట్లు ఉంటుందని అనుకున్నాడేమో.. ఆమిర్ ఆ పాత్రను ఇంకొంచెం ఇంప్రొవైజ్ చేద్దామని చూశాడు. బుద్ధి మాంద్యత ఉన్న పాత్రలో హావభావాలు, నటన పరంగా కొంచెం అతి చేశాడు.
కానీ అదే పెద్ద సమస్యగా మారింది. ఆ పాత్ర అసహజంగా, కృత్రిమంగా తయారైంది. పాత్ర ఔచిత్యం దెబ్బ తిని.. ఇంత తేడాగా ఉన్న వ్యక్తి ఆర్మీలో చేరడం ఏంటి.. యుద్ధానికి వెళ్లడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తాయి. ఆ పాత్ర మీద ఆపేక్ష కలగాల్సింది పోయి.. చాలాసార్లు చికాకు కలుగుతుందంటే దాన్ని ఆమిర్ ఎంతగా చెడగొట్టేశాడో అర్థం చేసుకోవచ్చు. కెరీర్లో తొలిసారిగా ఒక పాత్రకు ఆమిర్ మిస్ ఫిట్ అయ్యాడు, దాన్ని సరిగా చేయలేదు అనే భావన కలిగింది బహుశా ఈ చిత్రంలోనే కావచ్చు. హీరో పాత్రతో ప్రేక్షకులు ట్రావెల్ చేయడాన్ని బట్టే ఈ సినిమా ఫలితం ఆధారపడి ఉండగా.. అక్కడే తేడా కొట్టడంతో డిజాస్టర్ టాక్ ఎదురుకోక తప్పలేదు.
This post was last modified on August 12, 2022 11:55 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…