Movie News

లైగర్ ప్రమోషన్లకు కొత్త పేచీ

ఇంకో రెండే వారాల్లో లైగర్ రాబోతోంది. విజయ్ దేవరకొండ ఎడతెరిపి లేకుండా నార్త్ ప్రమోషన్లలో చాలా బిజీగా ఉన్నాడు. విపరీతంగా తిరిగేస్తూ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి చురుగ్గా ప్రోగ్రాంస్ లో పాల్గొంటున్నాడు. దర్శకుడు పూరి జగన్నాధ్ వీటిలో అధిక శాతం హాజరు కాలేకపోయినా ఫైనల్ కాపీ సిద్ధం చేసే పనులు చూసుకోవాలి కాబట్టి తప్పుబట్టడానికి లేదు.

లిరికల్ వీడియోలు క్రమం తప్పకుండా వదులుతున్నారు, హిట్టవుతున్నాయి కానీ అవేవీ యూట్యూబ్ మొత్తం షేకై పోయే సోషల్ మీడియా ఊగిపోయే రేంజ్ లో వైరల్ కావడం లేదు. ఇదిలా ఉండగా లైగర్ ఫోకస్ మొత్తం నార్త్ బెల్ట్ మీదే ఉండటం పట్ల మన బయ్యర్లు ఆందోళన చెందుతున్నారు. ఎంత ఇమేజ్ ఉన్నా విజయ్ దేవరకొండకు గత రెండు డిజాస్టర్ల ప్రభావం ఇక్కడి మార్కెట్ మీద ఉంది.

ఓపెనింగ్స్ గ్యారెంటీనే కానీ మార్నింగ్ షోస్ అయ్యాక న్యూట్రల్ ఆడియన్స్ రావాలంటే హైప్ చాలా కీలకం. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డులు కొట్టాలంటే ఇది ఫస్ట్ డేనే చూసి తీరాలన్నంత బజ్ ని సృష్టించాలి. ఇప్పటికైతే లైగర్ నుంచి ఆ స్థాయి పబ్లిసిటీ జోరూ హంగామా తెలుగు రాష్ట్రాల్లో కనిపించడం లేదు. చేతిలో కేవలం పధ్నాలుగు రోజులే ఉన్న నేపథ్యంలో ఇక్కడ కూడా ఫోకస్ పెట్టడం చాలా అవసరం. రేపేదైనా తేడా వస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో మొదటిరోజే తిరస్కరిస్తారు.

కానీ ఏపి తెలంగాణలో అలా కాదు. యావరేజ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కు అవకాశాలుంటాయి. అలా అని టాలీవుడ్ పరిస్థితులను లైట్ తీసుకోవడానికి లేదు. కానీ హిందీ వెర్షన్ హక్కుదారుడు కరణ్ జోహార్ ప్రమేయం వల్లే లైగర్ టీమ్ అక్కడ ఇరుక్కుపోయిందని ఆఖరికి అతని కాఫీ షోలో పాల్గొనేందుకు టైం దొరికిన హీరో హీరోయిన్లకు తెలుగు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు సమయం లేదన్న కామెంట్లు ఓపెన్ గానే విన్పిస్తున్నాయి, మరి లైగర్ ఏ రూపంలో సమాధానం ఇస్తుందో చూడాలి.

This post was last modified on August 12, 2022 12:39 am

Share

Recent Posts

చిన్న సినిమా సృష్టిస్తున్న సంచలనం పెద్దదే

కంటెంట్ కన్నా ముఖ్యం ఏది కాదనేది ఎప్పటికప్పుడు బాక్సాఫీస్ నిరూపిస్తునే ఉంటుంది. కాకపోతే కొందరు దర్శకులు తెలుసుకుంటారు, మరికొందరు తెలుసుకునేలోపే…

1 hour ago

మల్టీస్టారర్ మూవీకి మర్చిపోలేని అవమానం

కాంబినేషన్ మత్తులో ఇప్పటికీ చాలా మంది ప్రొడ్యూసర్లు, దర్శకులున్నారు. ప్రాక్టికల్ గా క్షేత్ర స్థాయిలో ప్రేక్షకులు ఎలా అప్డేట్ అయ్యారో…

2 hours ago

ఆంధ్రా ముద్దుబిడ్డ అనంత్ అంబానీ

నన్ను ఆంధ్రా బిడ్డగా భావించండి. ఈ అందమైన రాష్ట్రాభివృద్ధికి నావంతుగా ఏం చేయాలో... ఎలా సేవ చేయాలో గైడెన్స్ ఇవ్వండని…

3 hours ago

చాక్లెట్లు తీసుకొని టిక్కెట్లు ఇచ్చిన సీఎం

తమిళనాడు సీఎం విజయ్ రీల్ లైఫ్ సీఎం మాదిరి చేస్తున్న కొన్ని పనులు ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తన డ్రైవర్…

3 hours ago

వివేకా కేసులో అవినాష్ రెడ్డి చుట్టూ ఉచ్చు

వైఎస్ వివేకా మర్డర్ కేసు విచారణ వైసీపీ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నరీతిలో సాగిందని వివేకా తనయురాలు…

4 hours ago

త్రివిక్రమ్ వదులుకున్నది త్రివిక్రమ్‌కే పోటీగా

గత నెల సెప్టెంబర్ 18 హనుమాన్ అంశ్ తెలుగు డబ్బింగ్ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకుని ఆ మేరకు ప్రకటన…

4 hours ago