భలే మంచి చౌక బేరము అని పాడుకుంటున్నాడు రామ్ గోపాల్ వర్మ. లక్షలు పెట్టి ఏదో ఒక బూతు సినిమా తీయడం.. కోట్లు జేబులో వేసుకోవడం.. ఇదీ ఇప్పుడు వర్మ వరస. పోర్న్ స్టార్ మియా మాల్కోవాను పెట్టి ‘క్లైమాక్స్’ అనే సినిమా తీసి కోట్లు సంపాదించిన వర్మ.. ఈ మధ్యే స్వీటీ అనే లోకల్ అమ్మాయిని పెట్టి ‘నేక్డ్’ అనే నాసిరకం బూతు సినిమా ఒకటి తీసిన సంగతి తెలిసిందే. 2
2 నిమిషాల నిడివే ఉన్న ఈ సినిమాకు మొత్తం పెట్టిన ఖర్చు రూ.5 లక్షలేనట. దీనికి రూ.200 టికెట్ రేటు పెడితే.. దాన్ని కూడా వేలమంది ఎగబడి చూశారు. దాని ద్వారా కూడా వర్మకు బాగానే గిట్టుబాటు అయింది. థియేట్రికల్ రిలీజ్‌కు అవకాశం లేని ఈ రోజుల్లో ఓటీటీల స్టయిల్లో సొంతంగా ఒక ఫ్లాట్ ఫాం పెట్టి అందులో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో వర్మ ఈ సినిమాల్ని రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈసారి ఆయన్నుంచి ‘12 ఓ క్లాక్’ పేరుతో కొత్త సినిమా రానుంది. ఐతే ఇది గత రెండు సినిమాల్లాగా షార్ట్ ఫిలిం స్థాయిలో ఉండదట. దీని నిడివి గంటా 45 నిమిషాలట. ఎవరితోనో సినిమా తీయించి.. తన పేరుతో ప్రమోట్ చేయట్లేదు వర్మ ఈసారి. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది ఆయనే. ఈ సినిమాకు సంబంధించి పెద్ద ట్విస్టు ఏంటంటే.. దీనికి ఎం.ఎం.కీరవాణి నేపథ్య సంగీతం అందించారు.
వర్మ దర్శకుడిగా, వ్యక్తిగా తన స్థాయిని ఎంతగా తగ్గించుకున్నప్పటికీ.. ఆయనపై కీరవాణికి ప్రత్యేక అభిమానం ఉందని అంటారు సన్నిహితులు. ఆ అభిమానంతోనే వర్మ కొత్త చిత్రానికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇవ్వడానికి అంగీకరించినట్లున్నాడు కీరవాణి. వర్మ సినిమాలను జనాలు మరీ చీప్‌గా చూస్తున్న సమయంలో పోస్టర్ మీద కీరవాణి పేరు కనిపించడం షాకింగే. ఎన్నో ఏళ్లుగా ఏ సినిమాకైనా రవిశంకర్‌తోనే మ్యూజిక్ చేయించుకుంటున్న వర్మ.. దీనికి ప్రత్యేకంగా కీరవాణి సాయం ఎందుకు అడిగాడో?
This post was last modified on July 3, 2020 4:29 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…