ప్రతీ సినిమా వెనుక ఎవరికీ తెలియని ఎన్నో కథలుంటాయి. అవి ఆ సినిమా దర్శకుడో లేదా నటీ నటులో బయటపెడితేనే ప్రేక్షకులకు తెలుస్తుంది. తాజాగా తన సినిమా చెన్నకేశవరెడ్డి గురించి ఇలాంటి కొన్ని విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు స్టార్ డైరెక్టర్ వీవీ వినాయక్. తెరవెనుక కథలు అనే షోలో ఈ సినిమా గురించి చెప్పుకున్నాడు వీవీ వినాయక్.
“చెన్నకేశవరెడ్డి లో టబు చేసిన రోల్ కి ముందుగా సౌందర్య ని అనుకున్నాం. ఆమె నాకు పరిచయం ఉండటంతో బెంగళూర్ వెళ్లి కథ చెప్పాను. ఇందులో రెండు గెటప్స్ ఉంటాయని , చివర్లో ముసలి గెటప్ లో కనిపించాలని చెప్పాను. నెరేషన్ అయ్యాక ఆమె ఈ కేరెక్టర్ చేయలేను అనేసింది. దానికి కారణం ఇప్పుడే వృద్దురాలిగా కనిపించే పాత్ర చేయకూడదు అనుకుంటున్నానని చెప్పారు. నేను సరే అండి అని వచ్చేశా ఆ తర్వాత టబు గారిని అప్రోచ్ అవ్వగానే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.” అంటూ సౌందర్య బాలయ్య సినిమా ఎందుకు చేయలేదో చెప్పుకున్నాడు వినాయక్.
అలాగే సినిమాలో చెల్లెలి పాత్రలో నటించిన దేవయాని కేరెక్టర్ కోసం ముందుగా హీరోయిన్ లయ ని సంప్రదిస్తే ఆమె ఇప్పుడిప్పుడే హీరోయిన్ గా సినిమాలు చేస్తుంటే మీరు చెల్లెలి కేరెక్టర్ చేయమనడం న్యాయమేనా ? అంటూ ఏడ్చేసిందని వినాయక్ చెప్పారు. ఆ సినిమాలో దేవయాని కేరెక్టర్ ఎంత క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఆమె కూడా అప్పుడు హీరోయిన్ గా ఏవో చిన్న చితకా సినిమాలు చేస్తుంది అయినా వినాయక్ చెప్పిన కేరెక్టర్ కి ఓకె చెప్పేసి బాలయ్య చెల్లెలిగా మెప్పించింది.
This post was last modified on August 11, 2022 12:59 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…