విజయ్ దేవరకొండ ఏం చేసినా సంచలనమే.. వార్తాంశమే. తన కొత్త చిత్రం ‘లైగర్’ ప్రమోషన్లలో భాగంగా అతను పాల్గొంటున్న ప్రెస్ మీట్లు, స్పెషల్ ఈవెంట్లలో సందడి అందరూ చూస్తూనే ఉన్నారు. విజయ్‌కి తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజున్న సంగతి అందరికీ తెలిసిందే కానీ.. ‘లైగర్’కు ముందు వరకు ఏ పాన్ ఇండియా సినిమా చేయకపోయినా, హిందీలో నటించకపోయినా అతడికి ఉత్తరాదిన మంచి క్రేజ్ కనిపిస్తోంది. బీహార్, అహ్మదాబాద్.. ఇలా అతను పర్యటించిన ప్రతి చోటా యువత విరగబడి వస్తున్నారు.
వాళ్లను విజయ్ తనదైన శైలిలో ఎంటర్టైన్ చేస్తున్నాడు. కాగా ఈ ఈవెంట్లలో చిత్రంగా విజయ్ చెప్పులేసుకుని కనిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ముంబయిలో పోష్ డ్రెస్ వేసుకుని దానికి మ్యాచ్ అయ్యే షూలు వేసుకోకుండా చెప్పులతో కనిపించి అందరికీ పెద్ద షాకిచ్చాడు విజయ్. ఇదేమైనా కొత్త ఫ్యాషన్ ట్రెండా అని అంతా ఆశ్చర్యపోయాడు. ఐతే దీనికి ప్రత్యేక కారణం ఏమీ లేదంటున్నాడు విజయ్.
‘‘ప్రమోషన్లలో భాగంగా ప్రతి రోజూ ఒక డ్రెస్ వేసుకుంటున్నా. దానికి నప్పే షూస్ కోసం వెతుక్కోవడానికి, వాటిని వేసి తీయడానికి చాలా సమయం పడుతోంది. అందుకే ఈ చెప్పులు కొనుక్కున్నా. దీని వల్ల నా డ్రెస్సింగ్‌కి ఎక్కువ సమయం పట్టడం లేదు. నేను చెప్పులేసుకుని ప్రమోషన్లలో పాల్గొనడం వల్ల ఎవరైనా ఏమన్నా అనుకున్నా నేను పట్టించుకోను. ఎందుకంటే నాకు ఏం చేయాలనిపిస్తే అది చేస్తా’’ అని తనదైన శైలిలో జవాబు ఇచ్చాడు విజయ్.
‘లైగర్’ మూవీ తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకం తనకుందని, ఈ సినిమాను దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ చేరువ చేయడానికి ఇంకో రెండు వారాల సమయమే ఉందని.. అందుకే ప్రమోషన్లు గట్టిగా చేస్తున్నామని విజయ్ వివరించాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్-అనన్య పాండే జంటగా నటించిన ‘లైగర్’ను ఛార్మి, కరణ్ జోహార్ కలిసి నిర్మించారు. విజయ్ కెరీర్ మలుపు తిరగడానికి కారణమైన ‘అర్జున్ రెడ్డి’ రిలీజైన ఆగస్టు 25నే ఈ చిత్రం కూడా పలు భాషల్లో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on August 10, 2022 4:40 pm
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…