మాములుగా స్టార్ హీరో క్యామియో అంటే ఒకప్పుడు షూటింగ్ స్టేజిలోనే పిచ్చ క్రేజ్ వచ్చేది. ఒకవేళ ఆ పాత్ర కనక సరిగ్గా పండితే కేవలం దాని వల్లే ఆయా సినిమాలు బ్లాక్ బస్టర్ లైన సందర్భాలున్నాయి. పెదరాయుడులో రజనీకాంత్ కన్నా మంచి ఉదాహరణ అక్కర్లేదు. ఒసేయ్ రాములమ్మాలో కృష్ణ నటించినప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దానికి అండగా నిలబడ్డారు. లారెన్స్ స్టైల్ లో పెద్ద హీరోలను కాసేపు వాడుకోవడం దానికెంత ప్లస్ అయ్యిందో అప్పట్లో థియేటర్లో చూసినవాళ్లకు గుర్తే. కానీ ఇప్పుడా స్థాయి ఎగ్జైట్ మెంట్ కనిపించడం లేదు.
అసలు విషయానికి వస్తే నాగ చైతన్య ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సింగ్ చడ్డా ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అమీర్ ఖాన్ దీని ప్రమోషన్ కోసమే ముంబై నుంచి హైదరాబాద్ కు కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ అటు ఇటు తిరుగుతూ ప్రీమియర్లు వేస్తున్నాడు. సమర్పకుడిగా వ్యవహరిస్తున్న చిరంజీవి సైతం ఎన్నడూ లేని రీతిలో ప్రత్యేకంగా పబ్లిసిటీలో భాగమవుతూ హైప్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత అవుతున్నా ఈ మూవీకి ఉండాల్సిన స్థాయిలో బజ్ లేదు. సోషల్ మీడియాలో జరుగుతున్న బాయ్ కాట్ సంగతి తెలిసిందే
మరోవైపు తండ్రి నాగార్జున స్పెషల్ రోల్ చేసిన బ్రహ్మాస్త్ర పార్ట్ వన్ శివ సైతం బజ్ కోసం కిందామీదా పడుతోంది. ఇటీవలే విడుదలైన కొన్ని బాలీవుడ్ గ్రాండియర్లు డిజాస్టరైన నేపథ్యంలో బయ్యర్ల ఆశలు, ప్రేక్షకుల భయాలన్నీ దీని మీదే ఉన్నాయి. బాహుబలి రేంజ్ లో జనాలు ఎగబడి ఎదురుచూస్తారనుకుంటే అంత సీన్ కనిపించడం లేదు. సెప్టెంబర్ 9 రిలీజ్ కు కేవలం 30 రోజుల సమయం మాత్రమే ఉంది. సో మరి చైతు నాగ్ లకూ ఇద్దరికీ ఎదురవుతున్న ఈ క్యామియోల పరీక్షను ఎలా ఎదురుకుని విజయం సాధిస్తారో చూడాలి.
This post was last modified on August 9, 2022 4:12 am
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…