ఈ శుక్రవారం రిలీజైన రెండు తెలుగు చిత్రాల్లో ‘బింబిసార’ తొలి రోజు సంచలన వసూళ్లతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చివరగా ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో డిజాస్టర్ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. వశిష్ఠ అనే కొత్త దర్శకుడితో చేసిన సినిమాకు తొలి రోజు రూ.6.5 కోట్ల షేర్ రావడం చిన్న విషయం కాదు. అందులోనూ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కూడా అంత అనుకూలంగా లేవు. దీంతో పోలిస్తే చాలా మంచి టాక్ తెచ్చుకున్న ‘సీతారామం’ వరల్డ్ వైడ్ వివిధ భాషల్లో కలిపి రూ.2.5 కోట్ల షేరే రాబట్టింది.
ఈ సినిమాకు వచ్చిన టాక్‌తో పోలిస్తే ఇవి తక్కువ వసూళ్లే. ఐతే ఇది పక్కా క్లాస్ మూవీ కావడం, ‘బింబిసార’ మాస్‌ను బాగా ఆకర్షించడం వల్ల దీని కలెక్షన్లు తగ్గాయి. కానీ పాజిటివ్ టాక్ బాగానే పని చేసినట్లు కనిపిస్తోంది. తొలి రోజు మార్నింగ్ షోలు, మ్యాట్నీలతో పోలిస్తే.. ఈవెనింగ్, నైట్ షోలకు మంచి స్పందన వచ్చింది. ఈ ఊపు రెండో రోజు కూడా కొనసాగింది. కలెక్షన్లలో బిగ్ జంప్ చోటు చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
తొలి రోజుతో పోలిస్తే ‘సీతారామం’ వసూళ్లు పెరిగాయన్నది స్పష్టం. రెండో రోజు వరల్డ్ వైడ్ షేర్ రూ.4 కోట్ల దాకా ఉన్నట్లు అంచనా. తెలుగులో కంటే కూడా ఇతర భాషల్లో రెండో రోజు ‘సీతారామం’కు స్పందన పెరిగింది. తమిళంలో ఈ చిత్రాన్ని తొలి రోజు అసలు పట్టించుకోలేదు. కేవలం రూ.20 లక్షల షేర్ వచ్చింది. కానీ అక్కడి సమీక్షకులు సినిమాను అద్భుతం అంటూ కొనియాడారు. 4 రేటింగ్స్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ సినిమా గురించి గొప్పగా చెబుతుండటంతో రెండో రోజు తమిళ ప్రేక్షకుల్లో సినిమా పట్ల ఆసక్తి పెరిగింది.
అక్కడ శనివారం రూ.80 లక్షల షేర్ రావడం విశేషం. ఆదివారం సినిమాకు హౌస్ ఫుల్స్ పడే అవకాశం కనిపిస్తోంది. దుల్కర్ సొంత భాష మలయాళంలోనూ సినిమా తొలి రోజుతో పోలిస్తే బాగా పుంజుకుంది. హిందీ జనాలు కూడా సినిమా గురించి పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. ఇక యుఎస్‌లో ఈ చిత్రం అదరగొడుతోంది. వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును అందుకునేలా కనిపిస్తోంది. సినిమాకు యునానమస్ పాజిటివ్ టాక్ ఉండడంతో చాలా రోజులు థియేటర్లలో ఉండి పెద్ద హిట్టే అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on August 7, 2022 7:17 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…