టాలీవుడ్ కు ఈ నెల బోణీ బాగుంది. రెండు విజయాలతో ప్రారంభం కావడంతో మిగిలినవి కూడా అదే దారి పడితే మళ్ళీ పుంజుకోవచ్చనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వచ్చే వారం ఎన్ని వస్తున్నాయన్నది పక్కనపెడితే అందరి చూపు 25న విడుదల కాబోతున్న లైగర్ మీదే ఉంది. విజయ్ దేవరకొండ ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టేశాడు. ముంబై పూణే లాంటి నగరాలను ఈవెంట్ల కోసం రౌండ్ వేసేశాడు. తన కోసం వచ్చిన అభిమాన సందోహాన్ని చూసి అక్కడి మీడియా సైతం షాక్ అయ్యింది. ఇంటర్వ్యూలు గట్రా జోరుగా ఇస్తున్నాడు.
బిజినెస్ పరంగా లైగర్ ని హాట్ కేక్ లా అమ్మాలన్నది నిర్మాతల ప్లాన్. దానికి తగ్గట్టే కేవలం తెలుగు వెర్షనే 72 కోట్ల దాకా అమ్ముడుపోయినట్టు ఇన్ సైడ్ టాక్. వరంగల్ శ్రీనుకి లాక్ చేశారట. అఫీషియల్ కాలేదు కానీ లీకవుతున్న సోర్స్ చెబుతున్న సమాచారం గట్టిగానే ఉంది. మరోవైపు ఓవర్సీస్ హక్కులను 8 కోట్లకు విక్రయించినట్టు తెలిసింది. గత రెండు డిజాస్టర్లను చూస్తే విజయ్ దేవరకొండ మార్కెట్ కి మించి ఈ ధరలు పలకడం విశేషమే. హిందీ వెర్షన్ తాలూకు ప్రీ రిలీజ్ ట్రేడ్ లెక్కలు ఇంకా బయటికి రావాల్సి ఉంది
సరే జనం థియేటర్లకు వస్తున్నారు కదాని లైగర్ ని ఎగబడి చూస్తారని చెప్పలేం. అద్భుతంగా ఉందనే టాక్ వచ్చి, ఓసారైనా ఖచ్చితంగా చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమైతే తప్ప ఇదంత సేఫ్ పెట్టుబడి కాదు. అయితే 70 కోట్లకు పైగా షేర్ రాబట్టడం చిన్న విషయం కాదు. కెజిఎఫ్ రేంజ్ లో హైప్ పెరగాలి. మరి బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ తో ఊరమాస్ సెటప్ లో దర్శకుడు పూరి జగన్నాధ్ లైగర్ ని తీర్చిదిద్దిన తీరు ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి. ఇప్పటిదాకా వదిలిన లిరికల్ వీడియోస్ వినడానికన్నా ఎక్కువ చూసేందుకు బాగున్నాయనే టాక్ తెచ్చుకున్నాయి. ట్రైలర్ కూడా మరీ మెస్మరైజ్ చేయలేదు కానీ మెప్పించడంలో సక్సెస్ అయ్యింది.
This post was last modified on August 6, 2022 9:32 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…