Movie News

మాచర్ల మీద కొత్త ఒత్తిడి

వచ్చే వారం విడుదల కాబోతున్న మాచర్ల నియోజకవర్గం మీద ఇప్పటికైతే గొప్పగా చెప్పుకునేంత హైప్ కానీ అంచనాలు కానీ లేవు. అంజలితో చేసిన ఐటెం సాంగ్ చార్ట్ బస్టర్ కావడంతో మాస్ లో దీని గురించి బజ్ పెరిగింది కానీ ట్రైలర్ ఎన్ని మిలియన్ల వ్యూస్ తెచ్చుకున్నా బయట వాతావరణం దానికి భిన్నంగా ఉంది.

ముఖ్యంగా రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాచర్లని తీర్చిదిద్దినట్టుగా ఇచ్చిన ఇంప్రెషన్ క్లాస్ ఆడియన్స్ ని ఏ మేరకు ఆకట్టుకుందో చెప్పడం కష్టం. అందుకే ప్రమోషన్ ని కొత్త రూట్లో తీసుకెళ్లడం అవసరం. యూనిట్ తనవంతు బాధ్యతగా ఇంటర్వ్యూలు గట్రా మొదలుపెట్టింది కానీ ఇంకేదో మిస్ అవుతోందనే ఫీలింగ్ అయితే ఫ్యాన్స్ లో లేకపోలేదు. కారణాలున్నాయి.

సరిగ్గా వారం ముందు వచ్చిన బింబిసార, సీతారామంలు వాటిలో గ్రాండియర్ ప్లస్ కంటెంట్ తో ఆడియన్స్ మెప్పు పొందాయి. ఆర్ఆర్ఆర్, కెజిఎఫ్, విక్రమ్, మేజర్ తర్వాత ఆ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది వీటికే. మాచర్ల నియోజకవర్గంలో అలాంటి ఫ్యాక్టర్స్ లేవు. మరి నితిన్ మూవీలో స్పెషల్ ఏముందనే అభిప్రాయాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లాలి.

అసలే కార్తికేయ 2ని తక్కువ అంచనా వేయడానికి లేదు. మరోవైపు లాల్ సింగ్ చడ్డాని హిందీ సినిమా కదా పోటీ కాదని సరిపుచ్చుకున్నా నగరాల్లోని మల్టీ ప్లెక్స్ సెగ్మెంట్ మీద దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అందుకే మాచర్ల బృందం 12న ఓపెనింగ్స్ కోసం గట్టిగానే కష్టపడాల్సి ఉంటుంది. కొద్దిరోజుల క్రితం తన పాత ట్వీట్ల వల్ల అనవసరమైన వివాదంలో లాగబడ్డ దర్శకుడు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డికి డెబ్యూ మూవీ ఇది. కృతి శెట్టి గ్లామర్ మరో ఆకర్షణ కాగా ఊర మాస్ ఐఎఎస్ ఆఫీసర్ గా నితిన్ ఇందులో కొత్తగా కనిపించబోతున్నాడు. 

This post was last modified on August 6, 2022 5:46 pm

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

7 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

9 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

9 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

11 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

12 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

13 hours ago