మసూద.. టాలీవుడ్లో కొత్తగా ముస్తాబైన ఓ చిన్న సిినిమా. ‘జార్జిరెడ్డి’, ‘పలాస’ లాంటి సినిమాలతో మంచి పేరు సంపాదించిన తిరువీర్ ఇందులో హీరోగా నటించగా.. ‘ఖడ్గం’ సహా చాలా సినిమాలతో ఆకట్టుకున్న సీనియర్ నటి సంగీత ఇందులో ఓ ముఖ్య పాత్ర పోషించింది. ‘గంగోత్రి’లో బాల నటిగా ఆకట్టుకున్న కావ్య కళ్యాణ్ రామ్ మరో కీలక పాత్ర చేసింది. సాయికిరణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ సినిమా టీజర్‌ను తాజాగా నేచురల్ స్టార్ నాని లాంచ్ చేశాడు.
బడ్జెట్ పరంగా చిన్న సినిమానే అయినా.. కంటెంట్ పరంగా రిచ్‌గానే కనిపిస్తోంది ‘మసూద’. దీని టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. ఇది నజియా అనే ఓ ముస్లిం అమ్మాయి చుట్టూ తిరిగే కథ. మానసిక సమస్యలతో బాధ పడుతున్న ఆ అమ్మాయి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తుండటం.. దయ్యాన్ని చూశానని చెప్పి తాను భయపడడమే కాక అందరినీ భయపెట్టడం.. తనను మామూలు మనిషిని చేయడానికి తన వాళ్లు పడే తాపత్రయం.. ఈ నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
సంగీత ఇందులో సైన్స్ టీచర్ పాత్ర పోషించింది. సైన్స్ టీచర్ అయి ఉండి కూడా ఆ అమ్మాయిని పీర్ బాబాకి చూపిద్దామా అనే డైలాగ్ టీజర్లో వినిపించింది. టీజర్‌ను రెగ్యులర్ స్టయిల్లో కాకుండా డిఫరెంట్‌గా కట్ చేశారు. విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అన్నీ కూడా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇదొక డిఫరెంట్ మూవీ అనే ఫీలింగ్ కలిగిస్తున్నాయి. తిరువీర్, సంగీత తమ ప్రత్యేకతను చాటుకున్నారు.
ఈ చిత్రాన్ని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బేనర్ మీద రాహుల్ యాదవ్ నిర్మించాడు. నిర్మాతగా అతను తీసిన తొలి చిత్రం ‘మళ్ళీ రావా’ మంచి విజయం సాధించడమే కాక విమర్శల ప్రశంసలు అందుకుంది. ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రంతోనే దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత రాహుల్ యాదవ్.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస’ అనే మరో డిఫరెంట్ మూవీతో తన అభిరుచిని చాటుకున్నాడు. ఈ కోవలో మూడో సినిమాతో మరో వైవిధ్యమైన ప్రయత్నం చేసినట్లున్నాడతను.
This post was last modified on August 4, 2022 4:08 pm
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…