చెప్పాపెట్టకుండా కొద్దిరోజుల ముందు ఆగస్ట్ 12 విడుదల తేదీని కన్ఫర్మ్ చేసుకున్న విరుమన్ తెలుగులో వస్తుందో రాదో ఇప్పటికీ క్లారిటీ లేదు. చెన్నైలో తమిళ వెర్షన్ ట్రైలర్ లాంచ్ ని సూర్య ముఖ్య అతిథిగా గ్రాండ్ గా చేశారు. చూస్తే ఇదీ రొటీన్ విలేజ్ మాస్ డ్రామాగానే రూపొందినట్టు కనిపిస్తోంది. గతంలో ఇలాంటివి కార్తీ చాలానే చేశాడు.
పరుత్తి వీరన్( మల్లిగాడు), చినబాబు, కొంబన్(డబ్ కాలేదు) ఇవన్నీ ఒకే టెంప్లేట్ లో సాగే పల్లెటూరి సినిమాలు. ఈ విరుమన్ కూడా అదే కోవలో కనిపిస్తోంది తప్ప ప్రత్యేకంగా ఏమీ లేదు. ఒక చిన్న పల్లెటూరు. అక్కడో పంచ కట్టుకుని ఊరంతా మాస్ గా చుట్టేసే అల్లరి హీరో. వెనుక ఒక కమెడియన్. స్వయానా కుటుంబ సభ్యుడైన ప్రకాష్ రాజ్ తో గొడవ, లోకల్ పంచాయితీలు, ఓ లవ్ స్టోరీ వెరసి రెగ్యులర్ గా ఇలాంటి డ్రామాల్లో ఉండే మసాలాలన్నీ దర్శకుడు ముత్తయ్య ఇందులో పొందుపరిచాడు.
డీ గ్లామర్ లుక్స్ తో హీరోయిన్ అదితి శంకర్ వెరైటీగా కనిపిస్తోంది. అప్పుడెప్పుడో ముని, పందెం కోడిలో చూసిన రాజ్ కిరణ్ తాతయ్య గెటప్ లో దర్శనమివ్వబోతున్నాడు. మొత్తానికి ఎలాంటి కొత్తదనం లేకుండా మేనేజ్ చేశారు. ఇంతకీ విరుమన్ తెలుగులో వస్తుందో లేదో ఇంకా కన్ఫర్మ్ చేయలేదు.
తెలుగు హక్కులు ఎవరికీ ఇచ్చారో కన్ఫర్మేషన్ లేదు. ముఖ్యంగా కార్తీకి డబ్బింగ్ చెప్పుకునెందుకు టైం లేదు. చాలా హడావిడి పడాలి. పైగా లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లు ఉన్న నేపథ్యంలో అసలు విరుమన్ ని ఇక్కడ రిలీజ్ చేస్తారో లేదో అనుమానమే. ఒకవేళ చేయకపోతే తర్వాత ఎవరూ పట్టించుకోకపోయే ప్రమాదం ఉంది. తమిళంలో హిట్ అయితే ఓకే. ఇక్కడ తీసుకురావచ్చు. తేడా కొట్టిందంటే మాత్రం డ్రాప్ అవ్వడం బెటర్. రేపో ఎల్లుండో తెలుగు వెర్షన్ కు సంబంధించిన స్పష్టత రావొచ్చు
This post was last modified on August 4, 2022 1:31 pm
గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…
కూటమి ప్రభుత్వం లక్షకు పైగా కొత్త పింఛన్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న లబ్ధి దారులకు మేలు…
ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్రస్థాయిలో జనసేన నాయకులకు అర్ధమైంది ఏంటి? అనేది…
వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ పెట్టనున్నట్టు రాజ్యసభ మాజీ సభ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖపట్నంలో మాట్లాడిన ఆయన..…