ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తర్వాత ఆచార్య రూపంలో పెద్ద షాకే తిన్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ సినిమా తప్ప వేరే ఆలోచనలేవీ పెట్టుకోలేదు. దాదాపు సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్యాన్ ఇండియా మూవీని వచ్చే ఏడాది వేసవికి విడుదల చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దర్శకుడు శంకర్ ముందు వేగంగా పూర్తి చేస్తానని మాట ఇచ్చినప్పటికీ అందుకు అనుగుణంగా ప్లాన్ చేసుకోలేకపోవడంతో 2023 సంక్రాంతికి ఫిక్స్ చేసుకున్న టార్గెట్ కాస్తా తప్పని సరి పరిస్థితుల్లో మార్చుకోవాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా చరణ్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే సంఘటన నిన్న జరిగిన విరుమన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగింది. ఈ వేడుకకు సూర్యతో శంకర్ తదితర ప్రముఖులు అతిథులుగా విచ్చేశారు.
తన స్పీచ్ లో భాగంగా సూర్య ఆర్ సి 15 ప్రస్తావన తెచ్చారు. దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుడు శంకర్ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని చెబుతూ తెలుగు తమిళం నుంచే కాక అన్ని రాష్ట్రాల అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రమిదని ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. ఇండియన్ 2ని కాదని దీని గురించే చెప్పడమంటే స్పెషలేగా.
అందుకే ఇప్పుడా ఎలివేషన్ తాలూకు వీడియో బైట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సిఎం(కామన్ మ్యాన్) టైటిల్ దీనికి పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే లీక్స్ తిరుగుతున్నాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో బాయ్స్ లో నటించి ఇప్పుడు శంకర్ సినిమాకే సంగీతమందిస్తున్న తమన్ మరో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇస్తున్నాడని టాక్.
This post was last modified on August 4, 2022 12:21 pm
నారా లోకేశ్… ఇప్పటిదాకా మనకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ కేబినెట్ లో కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రిగా……
అగ్ర రాజ్యం అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఆ దేశ ప్రముఖ వ్యాపారవేత్త డొనాల్డ్ జే ట్రంప్ రెండు రోజుల క్రితం…
ఏపీలో ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో సంక్రాంతి వేడుకలు జరిగాయి.…
చాలా ఏళ్ల నుంచి నాసిరకం సినిమాలు తీస్తూ తనకున్న గొప్ప పేరునంతా పోగొట్టుకుని దర్శకుడిగా జీరో అయిపోయాడు రామ్ గోపాల్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్.. ఈ వార్త బయటికి వచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయిన వాళ్లే. తెలుగులో సున్నితమైన లవ్ స్టోరీలు,…
నిజమే. కేవలం రూ.500 లను పెట్టుబడిగా పెట్టిన ఆ ట్రక్కు డ్రైవర్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇదేదో ఎక్కడో…