ఆగస్ట్ 5న కళ్యాణ్ రామ్ తన ప్రతిష్టాత్మక సినిమా ‘బింబిసార’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి గట్టిగా ప్రమోషన్ చేస్తునాడు కళ్యాణ్ రామ్. కేవలం తెలుగులోనే రిలీజ్ కావడంతో తెలుగు మీడియాలో నిత్యం కనిపిస్తూ హంగామా చేస్తున్నాడు. అయితే కళ్యాణ్ కేవలం హీరో మాత్రమే కాదు. ఒక హీరో కూడా ఈ సినిమాకు హరి అనే వ్యక్తి నిర్మాతే కానీ బేనర్ కళ్యాణ్ రామ్ దే. ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్ స్ట్రైక్ నడుస్తోంది. ఈ విషయంపై కళ్యాణ్ రామ్ కి మీడియా నుండి ఓ ప్రశ్న ఎదురైంది.
దానికి కళ్యాణ్ రామ్ ఆన్సర్ ఇస్తూ ఇంకా ఆ స్ట్రైక్ గురించి తెలుసుకోలేదు ప్రెజెంట్ రిలీజ్ హడావుడిలో ఉన్నాను. నా సినిమా అయ్యాక అసలు సంగతి తెలుసుకొని మా నిర్మాతలతో చర్చిస్తాను అన్నాడు. ఇక తాజాగా ఈ విషయం గురించి నాతో సినిమాలు చేసే నిర్మాతలు వచ్చి కలుస్తా అంటే వద్దని చెప్పాను అంటూ కామెంట్స్ చేశాడు. ఇక బాలయ్య తో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా ఉంటుందని బాబాయ్ కి ఓ కథ చెప్పించాను కానీ ఆయనకి నచ్చలేదు నచ్చే కథ దొరికితే తప్పకుండా అయన సినిమా చేస్తారు అన్నాడు.
అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ లో తారక్ పార్ట్నర్ ఆ ? అనే విషయంపై కూడా కళ్యాణ్ రామ్ మాట్లాడాడు. తనకి తారక్ కి మధ్య లెక్కలు ఉండవని మేమంతా ఫ్యామిలీ అని చెప్పుకున్నాడు. బింబిసార విషయానికొస్తే ఇందులో యుద్దాలు భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఉండవని ఇది జస్ట్ బింబిసారుడి కథతో తీసిన సినిమా మాత్రమే అని. కాకపోతే విటలాచార్య సినిమాలో ఉండే కొన్ని ఫాంటసీ ఎలిమెంట్స్ మాత్రం ఉంటాయని తెలిపాడు. మరో రెండు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ సినిమాపై కళ్యాణ్ రామ్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాను అభిమానులతో కలిసి బ్రమరాంబ ధియేటర్ లో ఉదయం షో చూస్తానని చెప్పాడు.
This post was last modified on August 3, 2022 9:59 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…