రాధేశ్యామ్ ప్రి రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎక్కడా కనిపించలేదు ప్రభాస్. తన సినిమాల కబుర్లు కూడా పెద్దగా ఏమీ వినిపించడం లేదు. ఇలాంటి టైంలో సీతారామం ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ప్రభాస్ ముఖ్య అతిథిగా రాబోతున్నట్లు సమాచారం బయటికి వచ్చింది. ముందు ప్రభాస్ ఈ ఈవెంట్‌కు రావడంపై నిర్మాత అశ్వినీదత్ సందేహాలు వ్యక్తం చేశారు కానీ.. తర్వాత యంగ్ రెబల్ స్టార్ రాక ఖరారైంది.
ఇది ప్రభాస్ అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే కానీ.. వాళ్లు ప్రత్యక్షంగా ప్రభాస్‌ను చూసే అవకాశం మాత్రం లేనట్లే అని సమాచారం. ఈ వేడుకను ఎప్పుడూ ఈవెంట్లు జరిగే పెద్ద ఆడిటోరియాల్లో చేయట్లేదని సమాచారం. హైదరాబాద్‌లోని ఒక స్టూడియోలోని చిన్న ప్రాంగణంలో మీడియా, కొందరు సినీ ప్రముఖుల మధ్య ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సమాచారం.
దీనికి సాధారణ అభిమానులను అనుమతించబోరట. ఎంపిక చేసిన కొందరు మాత్రం ఈవెంట్లో పాల్గొంటారట.ఇటీవల బింబిసార ప్రి రిలీజ్ ఈవెంట్లో చోటు చేసుకున్న విషాదమే ఈ నిర్ణయానికి కారణమని తెలుస్తోంది. ఆ వేడుక సందర్భంగా ఒక అభిమాని అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. అతడి మరణానికి కారణాలేంటనే విషయమై రకరకాల ఊహాగానాలు సాగాయి.
గతంలో చాలాసార్లు ఫిలిం ఈవెంట్లలో ఇలాంటి విషాద ఘటనలు చోటు చేసుకోవడంతో అనుమతుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా, జాగ్రత్తలు తీసుకున్నా ఇలాంటి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభాస్ ఫిలిం ఈవెంట్‌కు వస్తున్నాడంటే పెద్ద ఎత్తున అభిమానులు అతణ్ని చూసేందుకు ఎగబడతారు. బింబిసార ఈవెంట్‌కు సంబంధించిన విషాద ఘటన నేపథ్యంలో ఈ టైంలో అభిమానులను అనుమతించి మళ్లీ ఏదైనా ప్రతికూల ఘటన చోటు చేసుకుంటే కష్టమన్న ఉద్దేశంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on August 3, 2022 1:24 pm
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…