నెపోటిజం, బంధుప్రీతి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాకు హాట్ టాపిక్ అయింది. సుశాంత్ సింగ్ రాజపుత్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనేది ఎవరికీ తెలియకపోయినా కానీ దానికి బాలీవుడ్ లో పెరిగిపోయిన నెపోటిజం కారణమని తేల్చేసారు కీబోర్డ్ వారియర్స్. వాళ్లకు కంగనా రనౌత్ లాంటి వాళ్ళ వత్తాసు దొరికింది. బాలీవుడ్ లో హీరోలు, హీరోయిన్లు ఎక్కువగా సినీ ఫ్యామిలీస్ నుంచే వస్తుంటారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల వారసులు వస్తుంటారు కానీ అమ్మాయిలను సినిమాల్లోకి పంపించరు. ఒకటీ అరా ఉదాహరణలు మినహా హీరోయిన్లకు వారసురాళ్ల నుంచి పోటీ ఏమీ ఉండదు. అయితే మన మీడియా కామెడీగా నెపోటిజం సమస్య గురించి మన హీరోయిన్లను అడుగుతోంది. వాళ్ళు కూడా దక్షిణాదిలో హీరోయిన్లకు ఆ సమస్య లేదని అనకుండా తోచిన సమాధానాలు చెప్పేస్తున్నారు.
సుశాంత్ సింగ్ రాజపుత్ కి సన్నిహితులు సైలెంట్ గా వుంటే.. ఎప్పుడో ఒకసారి అతనితో ఫోటో దిగిన వాళ్ళు, ఏదైనా పార్టీలో కలిసిన వాళ్ళు అతనితో ఉన్న స్మృతులు నెమరు వేసుకుని ట్రెండ్ క్యాష్ చేసుకోవడం రివాజు అయిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates