KGF ఇచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ హీరో యష్ ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తోంది. ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుకాలేదు. కన్నడలో మఫ్టీ లాంటి సూపర్ హిట్ మల్టీ స్టారర్ ఇచ్చిన నర్తన్ దర్శకత్వంలో చేయడం కన్ఫర్మ్ అయ్యిందని అప్పట్లో బెంగళూరు మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. తీరా చూస్తే అదింకా మొదలుకానే లేదు. అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కూడా ఎవరికీ తెలియదు.
శంకర్, పూరి జగన్నాధ్ లాంటి పేర్లు తొలుత వినిపించాయి కానీ ఇప్పుడా ఛాన్సెస్ కూడా క్రమంగా తగ్గిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. నిజానికి యష్ ఈ విషయంలో ప్రభాస్ ని స్ఫూర్తిగా తీసుకుంటే బెటర్. ఎందుకంటే బాహుబలి టైంలో ఇలాంటి ప్రెజరే వచ్చినప్పుడు డార్లింగ్ రిస్క్ చేసి మరీ కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్, రాధాకృష్ణలకు ఆఫర్ ఇచ్చాడు.
అఫ్కోర్స్ వాటి ఫలితాలు తేడా కొట్టినప్పటికీ దాని వల్ల ఇమేజ్ కు వచ్చిన డ్యామేజ్ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు ఒకేసారి ఏకంగా అయిదారు సినిమాలు లైన్ లో పెట్టేసి ఎడతెరిపి లేకుండా షూటింగ్స్ లో బిజీ అవుతున్నాడు. ఇందులో గన్ షాట్ గా ఏవి బ్లాక్ బస్టర్స్ అవుతాయో తనకూ తెలియదు.
ఇలా చేయడం తప్ప యష్ కు మరో ఆప్షన్ లేదు. ఏ హీరోకైనా ఈ దశ తప్పదు. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి అయ్యాక జూనియర్ ఎన్టీఆర్, ఒక్కడు దెబ్బకు మహేష్ బాబు, ఆర్య తర్వాత అల్లు అర్జున్ ఇలా అందరూ ఈ స్టేజిని అయోమయాన్ని దాటిన వాళ్లే. అంతే తప్ప ఎక్కువ వేచిచూసే కొద్దీ టైం వేస్ట్ అవ్వడం తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇరవై ఏళ్ళ క్రితం ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన యష్ కు ఇప్పుడు పన్నెండు వందల కోట్ల సినిమా వచ్చాక ఇలాంటి పరిస్థితి కలగడం సహజం. అలా అని జాప్యం చేస్తూ కూర్చుంటే ఒరిగే ప్రయోజనం కూడా ఏమీ లేదుగా..
This post was last modified on August 3, 2022 12:19 pm
రాయ్ పూర్ లోని ఇందిరా గాంధీ కృషి విశ్వవిద్యాలయం బీఎస్సీ ద్వితీయ సంవత్సరం పరీక్షా పేపర్ లీకేజి వ్యవహారం ఇప్పుడు…
పార్టీలు బలంగా ఉండాలంటే.. సమాజంలోని పలు వర్గాల మద్దతు అవసరం. నాయకులు, అధినేతలు ఎంత బలంగా ఉన్నా.. సమాజంలోని వర్గాలు…
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని బలోపేతం చేసేందుకు.. రాబోయే రోజుల్లో మరింత ఐక్యంగా ముందుకు సాగేలా వ్యూహాత్మక అడుగులు…
తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వర్గాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో ఒక వర్గానికి ఇంకో వర్గానికి అస్సలు…
ఒకప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావడం, ఇక్కడ పెద్ద స్థాయిలో రిలీజ్ కావడమే ఉండేది తప్ప.. తెలుగు చిత్రాలు…
మాజీ మంత్రి మల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెరవాల్సిందే. అది రాజకీయ సభ అయినా.. సినిమా…