ఇంకా ఫస్ట్ లుక్ రాలేదు, ప్రభాస్ ఎలాంటి గెటప్ లో కనిపిస్తాడో కనీసం క్లూ కూడా ఇవ్వలేదు అయినా కూడా ఆది పురుష్ అప్పుడే సెన్సేషన్లు మొదలు పెట్టేసింది. రెండు డిజాస్టర్లు బ్యాక్ టు బ్యాక్ పలకరించినా తన మార్కెట్ లో, బ్రాండ్ లో ఎలాంటి మార్పు రాలేదని డార్లింగ్ పదే పదే ఋజువు చేస్తూనే ఉన్నాడు.
సీతా రామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ అతిథిగా వస్తున్నాడన్న వార్త ఏకంగా ఆ సినిమాని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి తీసుకెళ్ళిందంటేనే అభిమానులతో పాటు ఆడియెన్స్ తనను ఎంతగా ఓన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆది పురుష్ కు సంబందించిన డిజిటల్ డీల్ ని అన్ని భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ 250 కోట్లకు కొనేసిందని ముంబై మీడియాలో పెద్ద టాకే నడుస్తోంది. ఇప్పటిదాకా ఇది ఏ ఇండియన్ సినిమాకు సాధ్యపడలేదు.
అందులోనూ రామాయణగాధను ఆధారంగా చేసుకున్న మైథలాజికల్ సబ్జెక్టు మీద ఒక అంతర్జాతీయ ఓటిటి ఇంత మొత్తంలో పెట్టుబడికి ముందు రావడం నిజంగా గొప్ప విషయం. ఆది పురుష్ ను తీస్తోంది హిందీ దర్శకుడు ఓం రౌత్ అయినప్పటికీ ప్రభాస్ హీరో కావడం వల్లే దీనికింత రేంజ్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ ఇంత రిస్క్ చేయడానికి కారణం లేకపోలేదు.
ఇటీవలే స్ట్రీమ్ చేసిన ఆర్ఆర్ఆర్ కేవలం హిందీ వెర్షన్ నుంచే ఊహించని స్థాయిలో అత్యద్భుతమైన రీతిలో గ్లోబల్ రీచ్ సాధించింది. మర్వెల్ లో ఎన్నో సూపర్ హీరోస్ సినిమాలు తీసిన దర్శకులు సైతం రాజమౌళి ప్రతిభకు సాహో అన్నారు. సో వాళ్ళకు మన సత్తా ఏంటో అర్థమైపోయింది. పైగా తానాజీని ఓం రౌత్ తీర్చిద్దిద్దిన విధానం చూశాక ఆది పురుష్ మీద ఎలాంటి అనుమానాలు పెట్టుకోనక్కర్లేదు. అఫీషియల్ స్టేట్ మెంట్ రాలేదు కానీ ఈ ఒప్పందం లాక్ అయ్యిందని విశ్వసనీయ సమాచారం
This post was last modified on August 3, 2022 10:30 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…