బాలీవుడ్లో ఇంటిమేట్ సీన్లు, హాట్ కిస్‌ల విషయానికి వస్తే.. ఒకప్పుడు ‘మర్డర్’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్. అందులో ఇమ్రాన్ హష్మితో కలిసి మల్లికా శరావత్ చేసిన ఇంటిమేట్ సీన్లు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. బాలీవుడ్లో అప్పటికే లిప్ లాక్స్, హాట్ సీన్లు ఉన్నప్పటికీ ఈ చిత్రంలోని సన్నివేశాల స్థాయిలో ఏవీ వేడి పుట్టించలేదు. ఈ సన్నివేశాలు కుర్రకారుకు ఓ రేంజిలో కిక్కివ్వడంతో సినిమా సెన్సేషనల్ హిట్టయింది. అదే సమయంలో శృంగార సన్నివేశాలను మరీ హద్దులు దాటించేశారన్న విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. మల్లికా శరావత్ మీద ఒక వర్గం విమర్శలు గుప్పించింది కూడా. ఐతే తర్వాతి కాలంలో ఇలాంటి సీన్లు మామూలైపోయాయి.
ఇప్పుడు ఇలాంటి వాటి గురించి ప్రత్యేకంగా చర్చ అంటూ ఏమీ ఉండట్లేదు. ఇదే విషయంపై మల్లికా శరారత్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత దీపికా పదుకొనే ‘గెహ్రయాన్’ సినిమాలో హాట్ సీన్లలో నటిస్తే అందరూ ప్రశంసలు కురిపించారని.. కానీ తన విషయంలో మాత్రం అప్పట్లో తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘గెహ్రయాన్ సినిమాలో సిద్ధాంత్ చతుర్వేదితో కలిసి దీపికా పలు రోమాంటిక్ సన్నివేశాల్లో నటించింది. చాలామంది ఆమె నటనపై ప్రశంసలు కురిపించారు.
కానీ 2004లో ఇమ్రాన్ హష్మితో కలిసి మర్డర్ సినిమాలో రోమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలామందికి నచ్చలేదు. దీంతో చాలా విమర్శలు చేశారు. మానసికంగా ఇబ్బందులకు గురి చేశారు. దీపికలాగా నన్ను కూడా ఎందుకు ప్రశంసించలేదో నాకు అర్థం కావడం లేదు’’ అని మల్లికా పేర్కొంది. ఇక ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి కూడా మల్లికా మాట్లాడింది.
‘‘అప్పట్లో ఎ- లిస్ట్‌లో స్టార్ హీరోలంతా నాతో పనిచేయడానికి నిరాకరించారు. అందుక్కారణం నేను కాంప్రమైజ్ కాకపోవడం. వాళ్లు తాము కంట్రోల్ చేయగలిగే, కాంప్రమైజ్ అయ్యే హీరోయిన్లతో మాత్రమే ఇష్టపడతారు. నేను అలా కాదు. నా వ్యక్తిత్వం అది కాదు. నేను ఎవరికీ లొంగాలనుకోను. వాళ్లు కూర్చోమంటే కూర్చోవాలి. నిలబడమంటే నిలబడాలి. తెల్లవారుజామున 3 గంటలకు హీరో ఫోన్ చేసి నా ఇంటికి రా అని పిలిస్తే వెళ్లాలి. ఆ సర్కిల్‌లో ఉంటేనే వారి సినిమాలో అవకాశం ఇస్తారు. ఒకవేళ పిలిచినప్పుడు మీరు వెళ్లకపోతే మిమ్మల్ని సినిమా నుంచి తీసేస్తారు. కానీ సినిమాల కోసం నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకోలేను’ అని చెప్పింది మల్లికా.
This post was last modified on August 2, 2022 4:40 pm
అగ్రరాజ్యం అమెరికా కొత్తగా సుంకాల పెంపు కారణంగా ఏపీలో ఆక్వా రంగంపై తీవ్ర ప్రభావం పడినా... కూటమి సర్కారు తీసుకున్న…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ తో కలిసి…
ఒకప్పుడు తమిళ డబ్బింగ్ సినిమాలను చూసి తెలుగులో ఇలాంటి సినిమాలు రావేంటి అని చాలా ఫీలయ్యేవాళ్లు మన ప్రేక్షకులు. అక్కడ ఎన్నో కొత్త…
మాస్ రాజా రవితేజకు గత కొన్నేళ్లలో పెద్ద హిట్ అంటే.. ధమాకానే. ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుని కూడా బ్లాక్ బస్టర్…
హైదరాబాద్ శిల్ప కళావేదికలో జరిగిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవాళ అభిమానులతో కళకళలాడిపోయింది. ఇదే నెలలో…
పాకిస్థాన్ క్రికెటర్ల మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. ఆటతోనే కాక మాటతీరుతోనూ వాళ్లు సోషల్ మీడియాకు టార్గెట్ అవుతుంటారు.…