సినిమా ఏదైనా సరే ఒక రిలీజ్ డేట్ ప్రకటించాక దానికే కట్టుబడతారన్న గ్యారెంటీ ఏ మాత్రం ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అనూహ్యంగా మారిపోతున్న పరిస్థితులు నిర్మాతలకు కొత్త సవాళ్లు విసురుతున్నాయి. దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు తప్పడం లేదు. విజయ్ దేవరకొండ ఖుషిని గతంలో డిసెంబర్ రిలీజని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడా స్లాట్ ని వదులుకోబోతున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. దాని స్థానంలో అఖిల్ ఏజెంట్ ని అదే నెల 23 విడుదల చేసేందుకు ప్లానింగ్ జరుగుతోందని విశ్వసనీయ సమాచారం. ఖుషి షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. లైగర్ ప్రమోషన్ల విస్తృతంగా తిరుగుతున్న రౌడీ హీరో ఇంకో నెల దాకా అందుబాటులో ఉండే అవకాశం లేదు. ఖుషి కొంత భాగమే ఉన్నప్పటికీ హడావిడి చేయడం ఇష్టం లేక దాన్ని జనవరి ప్రారంభంలో లేదా రిపబ్లిక్ డే సందర్భంగానో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మైత్రి నుంచి వస్తున్న లీక్.
కన్ఫర్మ్ చేయలేదు కానీ ఆల్మోస్ట్ వాయిదా ఫిక్స్ అయినట్టే. మరోవైపు ఆగస్ట్ నుంచి డ్రాప్ అయ్యాక ఏజెంట్ కి అక్కినేని సెంటిమెంట్ డిసెంబర్ కంటే బెటర్ ఆప్షన్ కనిపించడం లేదు. నిన్నటి నుంచి మొదలైన షూటింగుల బందు తాలూకు పరిణామాలు ఇలాంటి వాటి మీద ఇంకా ఉండబోతున్నాయి.
దసరాతో మొదలుపెట్టి 2023 సంక్రాంతి దాకా ఆల్రెడీ లాక్ చేసుకున్న రిలీజుల్లో చాలా మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. ఒకవేళ వీలైనంత త్వరగా బంద్ ముగిసిపోతే ఎలాంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఈ మార్పుల పర్వం భారీ స్థాయిలో ఉండబోయేది మాత్రం వాస్తవం. ఇప్పుడీ ఖుషి-ఏజెంట్ ల మార్పిడి కూడా అఫీషియల్ అయ్యేదాకా వేచి చూడాలి.
This post was last modified on August 2, 2022 1:24 pm
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…
భారత ఎన్నికల సంఘానికి సమర్పించిన విరాళాల నివేదికల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాజకీయ పార్టీలు తమకు అందిన…
యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…