Movie News

జూలై 2022 – టాలీవుడ్ పీడకల

మాములుగా ప్రతి నెల హిట్లు ఫ్లాపులు సహజంగా ఉంటాయి. ఇది సినిమా పుట్టినప్పటి నుంచి ఉన్నదే. నాలుగు శుక్రవారాల్లో కనీసం ఒక్కటైనా సక్సెస్ ఫుల్ మూవీ ఉండటం చూస్తూనే ఉన్నాం. అయితే ఈసారి జూలై మాత్రం టాలీవుడ్ ఎప్పటికీ మర్చిపోలేని పీడకలగా మిగిలిపోయింది. స్టార్ దర్శకులతో మొదలుకుని డెబ్యూ డైరెక్టర్ల దాకా అందరికీ షాక్ ఇచ్చి ఇలాంటి నెల మళ్ళీ రాకూడదు బాబోయ్ అనిపించేలా భయపెట్టేసింది.

ప్రభాస్, చిరంజీవిల ఆఫర్లు కొట్టేసిన దర్శకుడు మారుతీ నుంచి ‘పక్కా కమర్షియల్’ లాంటి అవుట్ డేటెడ్ ఎంటర్టైనర్ ఎవరూ ఆశించలేదు. ఇది ఎంత పెద్ద పరాజయమంటే దెబ్బకు రిలీజైన రెండో రోజు నుంచే గోపీచంద్ మాయమయ్యేంత. పబ్లిసిటీలో చూపించిన వైవిధ్యం సినిమాలో లేకపోవడంతో ‘హ్యాపీ బర్త్ డే’కు పరాభవం తప్పలేదు. టికెట్ రేట్లు తగ్గించామని పదే పదే మొత్తుకున్నా మీరు ఫ్రీగా చూపించినా మాకొద్దు అంటూ ఆడియన్స్ తిరస్కరించారు.

తన మాస్ మార్కెట్ ని పెంచుతుందని రామ్ ‘ది వారియర్’ మీద పెట్టుకున్న ఆశలన్నీ దర్శకుడు లింగుస్వామి నీరుగార్చేశారు. నాగచైతన్య కెరీర్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా ‘థాంక్ యు’ పేరెత్తితే చాలు అభిమానులే కాదు ఎగ్జిబిటర్లు సైతం హడలేత్తిపోతున్నారు. ఆఖరికి కొన్ని సి సెంటర్లలో వన్ ప్లస్ వన్ టికెట్లు ఇచ్చిన వైనాన్ని చూశాం. పోనీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ అయినా ఊరటనిస్తుందనుకుంటే అదీ వేడినీళ్లు మొహం మీద కొట్టేసి తుస్సుమంది.

మొత్తంగా చూస్తే జూలైలో బాగా అంచనాలున్న సినిమాలు అయిదు వస్తే అవన్నీ ఒకే ఫలితాన్ని అందుకోవడం విచారకరం. రెండో మూడో హిట్ అయినా ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒకరకంగా చెప్పాలంటే బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే నెలకొన్న అనిశ్చితికి ఈ జూలై అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది. టికెట్ రేట్లు, వర్షాలు, ఓటిటి వగైరా కారణాలు ఎన్ని చెప్పుకున్నా జనం థియేటర్లకు వచ్చే విషయంలో చాలా నిర్దయగా ఉన్నారు. కంటెంట్ ఇవ్వండి విక్రమ్, మేజర్ లాగా నెత్తినబెట్టుకుంటాం. లేదూ ప్రమోషన్ల మీద ఉన్న శ్రద్ధ స్క్రిప్ట్ ల మీద పెట్టలేం అంటే ఇదుగో ఇలాంటి జూలైలు మళ్ళీ మళ్ళీ వస్తాయి అని కడిగేస్తున్నారు. ఇలాంటివి రాకూడదనే ప్రతిఒక్కరి కోరిక.

This post was last modified on August 1, 2022 9:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బన్నీ ఉదంతం – ఆనందాన్ని కమ్మేసిన ఆందోళన!

సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…

26 minutes ago

నా సినిమా లేకపోయి ఉంటే OG ని తీసుకొచ్చేవాడిని : చరణ్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…

1 hour ago

ఏపీలో.. టైం టేబుల్ పాల‌న‌!!

సాధార‌ణంగా ప్ర‌తి ప్ర‌భుత్వం త‌న ప‌ని తాను చేసుకుని పోతుంది. ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్ర‌ణాళిక‌లు.. కొన్ని…

4 hours ago

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

10 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

11 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

12 hours ago