చరణ్ ని ఉంచాలా… తీసెయ్యాలా?

ఆచార్య సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ కి రామ్ చరణ్ అయితే బాగుంటుందని చిరంజీవి, కొరటాల శివ భావించారు. అయితే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్.తో చరణ్ బిజీగా ఉండడం వల్ల ఆ పోర్షన్ ఇంకా షూట్ చేయలేదు. రామ్ చరణ్ ఒక చిన్న పాత్ర చేయడానికి, అది ఆర్.ఆర్.ఆర్. ముందు రిలీజ్ అవడానికి రాజమౌళి ఇష్టపడలేదు.

అందుకే ఆర్.ఆర్.ఆర్. రిలీజ్ అయినా తర్వాత ఆచార్య వస్తే ఫర్వాలేదని చెప్పాడు. అలా చరణ్ ఒక్క రోజు కూడా ఆచార్య షూటింగ్ చేయలేదు. ఇప్పుడు కరోనా వల్ల అన్నీ అటు, ఇటు అయిపోయాయి. ఆర్.ఆర్.ఆర్. షూటింగ్ ఇప్పట్లో పూర్తయ్యే దాఖలాలు లేవు. అన్నీ సజావుగా సాగితే సెప్టెంబర్ నుంచి ఆచార్య మొదలు పెట్టాలని కొరటాల శివ చూస్తున్నాడు.

మరి చరణ్ ఆ పాత్ర చేయడానికి రాజమౌళి అంగీకరిస్తాడా? లేక ఆచార్యలో ఆ పాత్ర వేరే నటుడికి ఆఫర్ చేస్తారా? చరణ్ కాకపోతే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలున్నారు కానీ చరణ్ వల్ల వచ్చే బిజినెస్ అడ్వాంటేజ్ వరుణ్ లేదా సాయి తేజ్ వల్ల రాదు. ప్రస్తుతానికి చరణ్ ఈ సినిమా చేయడమైతే సస్పెన్స్ గానే ఉంది.