ఈ వీకెండ్లో వివిధ భాషల్లో భారీ చిత్రాలే విడుదల అయ్యాయి. వాటిలో దేనికీ ఆశించిన టాక్ అయితే రాలేదు. తెలుగులో ‘రామారావు ఆన్ డ్యూటీ’ పూర్తి నెగెటివ్ టాక్‌తో మొదలైంది. హిందీలో ‘ఏక్ విలన్ రిటర్న్స్’కు మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. ఈ రెండు చిత్రాలకు ఓపెనింగ్స్ ఒక మోస్తరుగా వచ్చాయి. రవితేజ సినిమా వీకెండ్ తర్వాత నిలబడే పరిస్థితి అసలు కనిపించడం లేదు. దీంతో పోలిస్తే ‘ఏక్ విలన్ రిటర్న్స్’ మెరుగైన ఓపెనింగ్స్ రాబట్టేలా ఉంది. కానీ వీకెండ్ తర్వాత ఇది ఏమేర సత్తా చాటుతుందన్నది చూడాలి.
కాగా కన్నడలో డివైడ్ టాక్‌తో మొదలైన కిచ్చా సుదీప్ సినిమా ‘విక్రాంత్ రోణ’కు దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో మంచి వసూళ్లే రావడం విశేషం. కర్ణాటకలో అయితే ఇది ఆల్ టైం డే-1 హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్ ‘విక్రాంత్ రోణ’కు తొలి రోజు రూ.35 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావడం విశేషం. ‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీ తర్వాత ఓ కన్నడ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఇదే ప్రథమం.
ఒక మంచి మాస్ పాట పడితే సినిమాకు ఎంత ప్లస్ అవుతుందని చెప్పడానికి ‘విక్రాంత్ రోణ’ నిదర్శనం. ఈ చిత్రంలోని ‘రా రా రక్కమ్మ’ సోషల్ మీడియాలో రెండు నెలలుగా ఊపేస్తోంది. ఇన్‌స్టా రీల్స్, యూట్యూబ్ షార్ట్స్‌లో ఈ పాట సందడి అంతా ఇంతా కాదు. కేవలం ఈ పాట కోసమే సినిమా చూడాలని అనుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ట్రైలర్ కూడా కాస్త ఎగ్జైటింగ్‌గానే ఉండడంతో అన్ని భాషల ప్రేక్షకుల్లోనూ సినిమా పట్ల ఆసక్తి నెలకొంది.
తెలుగులో ఈ చిత్రం తొలి రోజు రూ.2 కోట్లకు చేరువగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టడం విశేషం. నార్త్ మార్కెట్లో కూడా ‘విక్రాంత్ రోణ’కు మంచి స్పందనే వస్తున్నట్లు అక్కడి ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. సినిమాకు టాక్ పాజిటివ్‌గా ఉంటే వసూళ్లు అంచనాలకు అందని విధంగా ఉండేవే. అయినప్పటికీ డివైడ్ టాక్‌ను తట్టుకుని సినిమా ప్రస్తుతానికి బాక్సాఫీస్ దగ్గర బలంగానే నిలబడుతోంది. వీకెండ్ అయ్యేసరికి కలెక్షన్లు రూ.60 కోట్లకు చేరువ కావచ్చు. ఓ కన్నడ సినిమాకు వారాంతంలో ఇంత వసూళ్లు రావడం విశేషమే.
This post was last modified on July 30, 2022 7:46 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…