తెలుగులో తన తొలి చిత్ర హీరో అయిన అక్కినేని నాగచైతన్యతో.. కొన్నేళ్ల తర్వాత ప్రేమలో పడింది సమంత. అతనూ ఆమెను ఇష్టపడి కొన్నాళ్లు ప్రేమలో ఉన్న ఈ జంట.. ఐదేళ్ల కిందట మూడు ముళ్ల బంధంతో ఒక్కటైంది. అప్పుడా జంటను చూసి ముచ్చట పడని వారు లేరు. చైతూ, సామ్ అభిమానులే కాక అందరికీ ఆ జంట చాలా ముచ్చటగా అనిపించింది. ఈ జంట ఎప్పటికీ ఇలాగే ఉండాలని అంతా కోరుకున్నారు. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి కథ మారిపోయింది. అందరికీ షాకిస్తూ.. చైతూ, సామ్ జంట విడాకులు తీసుకుంది.
ఈ వ్యవహారం మీద నెలల తరబడి చర్చ జరగడం తెలిసిందే. ఇంకా కూడా ఆ చర్చకు తెరపడడం లేదు. ఏదో విధంగా చైతూ-సామ్ బంధం చర్చకు వస్తూనే ఉంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటుడు మురళీ మోహన్ మాట్లాడుతూ.. గతంలో తాను నిర్మించిన అపార్ట్‌మెంట్లోని ఒక ఫ్లాట్ చూసి ఎంత ముచ్చట పడడం. తాను ఇవ్వనన్నా కూడా నాగార్జున సాయంతో దాన్ని కొనడం.. అందులో ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట చివరికి విడిపోయి తనను షాక్‌కు గురి చేయడం గురించి వెల్లడించారు.
కాగా తాజాగా మురళీ మోహన్ ఈ ఇంటి గురించి ఇంకో ఆసక్తికర విషయం వెల్లడించారు. ఈ ఇంటిని వద్దనుకుని వెళ్లిపోయాక.. తిరిగి సమంత దాన్ని సొంతం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. విడాకుల తర్వాత సమంత వేరే ఇంటికి వెళ్లినా సౌకర్యంగా లేకపోవడం, వేరే ఇళ్లు చూసి సంతృప్తి చెందకపోవడంతో తిరిగి ఆ ఇంటినే కొనుక్కుందని మురళీ మోహన్ చెప్పారు.
మధ్యలో ఆ ఇంటిని వేరే వాళ్లు కొనుక్కున్నారని.. సమంత అడిగినా తాను చేయగలిగిందేమీ లేదని చెప్పానని.. కానీ ఇంత మంచి ఇల్లు తనకు ఇంకెక్కడా దొరకడం లేదని సమంత అనడంతో దాని ఓనర్‌తో మాట్లాడించినట్లు ఆయన తెలిపారు. ఇంతకుముందు అమ్మిన రేటు మీద లాభం ఇచ్చి తిరిగి సమంత ఆ ఇంటిని సొంతం చేసుకుందని మురళీ మోహన్ చెప్పారు. ప్రస్తుతం సమంత తన తల్లితో కలిసి ఆ ఇంట్లో ఉంటోందన్నారు. సమంతకు నాగచైతన్య ఆ ఇంటిని రాసిచ్చినట్లు సోషల్ మీడియాలో గతంలో ప్రచారం జరగ్గా.. అలాంటిదేమీ లేదనడానికి మురళీ మోహన్ మాటలే రుజువంటూ సమంత అభిమానులు ఈ ప్రచారం చేసిన వారికి కౌంటర్ ఇస్తున్నారిప్పుడు.
This post was last modified on July 29, 2022 6:50 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…