కెజిఎఫ్ రేంజ్ లో ఉంటుందని ఊరించి అదే స్థాయిలో ప్రమోషన్లు చేసుకున్న కిచ్చ సుదీప్ విక్రాంత్ రోణకు తెలుగులో ఏమంత పాజిటివ్ టాక్ కనిపించడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ అసలైన కథ విషయంలో దర్శకుడు అనూప్ భండారి చేసిన పొరపాట్ల వల్ల ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోతోంది. కన్నడ, హిందీలో అంతో ఇంతో పాజిటివ్ రెస్పాన్స్ కనిపిస్తోంది కానీ మిగిలిన భాషల్లో మాత్రం అధికశాతం ఆడియన్స్ పెదవి విరుస్తున్నారు.
నిజానికి విక్రాంత్ రోణ కోసం దర్శకుడు అనూప్ కొత్త కథనేమి తీసుకోలేదు. తన డెబ్యూ మూవీకే అదనపు కోటింగ్ ఇచ్చి జనాల మీదకు వదిలాడు. వివరాల్లోకి వెళ్తే ఇతని మొదటి సినిమా రంగితరంగ. 2015లో విడుదలైన ఈ హారర్ థ్రిల్లర్ శాండల్ వుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టు. చాలా సెంటర్స్ లో వంద రోజులాడింది. దీనికి చాలా అవార్డులు వచ్చాయి. ఫిలింఫేర్, సైమా, ఇఫా. కర్ణాటక రాష్ట్ర పురస్కారం ఇలా ఎన్నో దక్కించుకుంది. కొమరొట్టు గ్రామంలో జరిగే గర్భిణుల హత్యలను ఆధారంగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో దీన్ని ప్రెజెంట్ చేశారు.
అందులో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ దాకా సాధుజీవిగా కనిపించిన సాయికుమార్ ని విలన్ గా రివీల్ చేసి షాక్ ఇస్తారు. మొహానికి సగంపైగా ఏదో జాతరకు సంబంధించిన మేకప్ వేసుకుని మర్డర్లు చేసుంటాడు. ఇప్పుడీ విక్రాంత్ రోణలో కూడా ఇదే కొమరొట్టు సెటప్, ఇదే కలర్ మొహాల ట్విస్టు పెట్టాడు. ప్రెగ్నెంట్ల స్థానంలో చిన్నపిల్లలు హత్య చేయబడతారు. అదొక్కటే తేడా. సుదీప్ లాంటి బడా హీరో కాబట్టి బడ్జెట్, గ్రాఫిక్స్ పెరిగాయి అంతే. చంద్రముఖినే నాగవల్లిగా మళ్ళీ తీసి కామెడీ చేసినట్టు రంగితరంగికే తిరగమోత వేసి విక్రాంత్ రోణగా వండిన అనూప్ కు తెలుగులో హిట్టు దక్కనట్టే.
This post was last modified on July 29, 2022 9:52 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…