Movie News

‘ఏజెంట్’ కొత్త ఎత్తుగడ

అంతా అనుకున్నట్లు జరిగితే ఇంకో రెండు వారాల్లో ‘ఏజెంట్’ సినిమా విడుదల కావాల్సింది.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంచ్ చేసినపుడే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి ఆగస్టు 12న ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ప్రకటించారు. కానీ అఖిల్ కెరీర్‌కు చాలా కీలకమైన సినిమా కావడంతో మేకింగ్ విషయంలో రాజీ అన్నదే లేకుండా ముందుకు సాగుతోంది చిత్ర బృందం. అందు వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతోంది. ఆల్రెడీ ఇండిపెండెన్స్ డే వీకెండ్ నుంచి సినిమా తప్పుకుంది. ఇక తర్వాతి టార్గెట్ దసరా కావచ్చని అన్నారు. కానీ అప్పటికి కూడా సినిమా రిలీజయ్యే ఛాన్స్ తక్కువే అన్నది తాజా సమాచారం.

అసలీ ఏడాది ‘ఏజెంట్’ రిలీజ్ కాదట. దీన్ని 2022 సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్నట్లు సమాచారం. మామూలుగా సంక్రాంతి బెర్తులు ఐదారు నెలల ముందే ఖరారైపోతుంటాయి. ఐతే వచ్చే సంక్రాంతి సినిమాల విషయంలో క్లారిటీ లేదు. ఆ పండక్కి అనుకున్న సినిమా ఒక్కొక్కటిగా రేసు నుంచి తప్పుకుంటూ వస్తోంది.

రామ్ చరణ్-శంకర్ సినిమా, హరి హర వీరమల్లు, మహేష్-త్రివిక్రమ్ మూవీ.. ఇలా ఎప్పటికప్పుడు ఒక కొత్త సినిమాను సంక్రాంతి రేసులో నిలిపినట్లు కనిపించింది. కానీ వీటిలో ఏదీ ఆ పండక్కి వచ్చే అవకాశాలు లేవు. హరి హర వీరమల్లు అసలెప్పటికి పూర్తవుతుందో తెలియట్లేదు. మహేష్-త్రివిక్రమ్ సినిమా మొదలవడంలో ఆలస్యం జరగడంతో వచ్చే వేసవికి వాయిదా పడిపోయింది. చరణ్-శంకర్ సినిమా కూడా సంక్రాంతి రేసు నుంచి దాదాపు తప్పుకున్నట్లే కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2022 సంక్రాంతి ఖరారైన సినిమాలు ఆదిపురుష్, గాడ్ ఫాదర్ మాత్రమే. వైష్ణవ్ తేజ్ కొత్త చిత్రాన్ని కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు కానీ.. అది వచ్చే అవకాశాలు తక్కువేనట.

ఈ నేపథ్యంలో మంచి క్రేజున్న ‘ఏజెంట్’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి ప్రయోజనం పొందాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం. మామూలు రోజులతో పోలిస్తే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు సంక్రాంతి టైంలో 30-40 శాతం ఎక్కువ వసూళ్లు వస్తాయి. అందుకే ‘ఏజెంట్’ను ఆ టైంలో రిలీజ్ చేసి అఖిల్‌కు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఇచ్చి అతడిని మాస్ హీరోగా నిలబెట్టాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on July 28, 2022 2:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నెగిటివిటీ ప్రభావానికి సినీ బాధితులు ఎందరో

సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…

27 minutes ago

విశాల్ ప్రభావం – 30 సినిమాల బూజు దులపాలి

పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…

1 hour ago

అఖండ 2 ఇంటర్వల్ కే మీకు పైసా వసూల్ : తమన్

ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…

2 hours ago

మాకు సలహాలు ఇవ్వండి బిల్ గేట్స్‌కు చంద్ర‌బాబు ఆహ్వానం

ప్ర‌పంచ ప్ర‌ఖ్యాత ఐటీ దిగ్గ‌జ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు,…

3 hours ago

శార‌దా ‘స్వామి’ తిరుమల లో చేసింది తప్పే

విశాఖ‌ప‌ట్నంలోని శార‌దాపీఠం అధిప‌తి స్వ‌రూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్ర‌చారంలో ఉన్న విష‌యం తెలిసిందే. వైసీపీ హ‌యాంలో ఆయ‌న చుట్టూ…

3 hours ago

రిలయన్స్ న్యూ కరెన్సీ.. జియో కాయిన్

ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…

3 hours ago