ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఇంకా అఫీషియల్ గా ఎనౌన్స్ అవ్వలేదు కానీ ‘ఉప్పెన’ సక్సెస్ తర్వాత బుచ్చిబాబు ని కథ రెడీ చేసుకోమని చెప్పేసి అతని నెరేషన్ కూడా వినేశాడు ఎన్టీఆర్. పెద్ది అనే టైటిల్ తో మాస్ కమర్షియల్ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు. విజయనగరం నేపథ్యంలో కబడ్డీ గేమ్ తో కథ రెడీ చేసుకున్నాడు బుచ్చి బాబు. దాని మీద తారక్ కి రెండు మూడు నెరేషన్స్ ఇచ్చాడు. కానీ సెకండాఫ్ మీద ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా లేడు. దీంతో బుచ్చి తన టీం తో కొన్ని రోజులుగా హైదరాబాద్ హోటల్స్ తో డిస్కషన్స్ చేస్తూనే ఉన్నాడు. అయినా పనవ్వడం లేదు. దీంతో ఎన్టీఆర్ ఇప్పుడు సుక్కుని రంగంలోకి దింపాడని తెలుస్తుంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పూర్తయ్యే లోపు బుచ్చి ఫైనల్ స్క్రిప్ట్ రెడీ చేయాల్సి ఉంది. ఇక తన స్క్రిప్ట్ కి హెల్ప్ చేయమని గురువుని శిష్యుడు కోరాడట. ఎన్టీఆర్ కూడా మీరు స్క్రిప్ట్ కి వర్క్ చేస్తే బాగుంటుందని స్పెషల్ గా సుక్కు తో అన్నాడని తెలుస్తుంది. దీంతో ఉన్నపళంగా బుచ్చిబాబు అండ్ టీంతో సుక్కు థాయిలాండ్ వెళ్ళిపోయాడు.
ప్రస్తుతం థాయిలాండ్ లో ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కోసం రాత్రి పగలు వర్క్ చేస్తున్నారని తెలుస్తుంది. పనిలో పనిగా పుష్ప 2 కి సంబంధించి కొన్ని సీన్స్ కూడా డిస్కస్ చేసేస్తున్నారని సమాచారం. మరి సుక్కు రంగంలోకి దిగాడు కాబట్టి పెద్ది స్క్రిప్ట్ ఓ కొలిక్కి రావడం , ఎన్టీఆర్ కి నచ్చడం ఖాయమనిపిస్తుంది. మరి సుక్కు పుష్ప 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నప్పటికీ శిష్యుడి సినిమా కోసం టైం కేటాయించి థాయిలాండ్ వెళ్ళడం గొప్ప విషయమే.
This post was last modified on July 28, 2022 11:47 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…