కేజీఎఫ్ సీక్వెల్ మీద భారీ అంచనాలే నెలకొన్నాయి కానీ.. ఆ చిత్రం రాజమౌళి సినిమా ఆర్ఆర్ఆర్‌ను మించి కలెక్షన్లు సాధిస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఆర్ఆర్ఆర్ ఓవరాల్ వసూళ్లు రూ.1140 కోట్ల దగ్గర ఆగిపోగా.. కేజీఎఫ్-2 ఏకంగా రూ.1200 కోట్ల మార్కును దాటేసింది. డివైడ్ టాక్‌తో మొదలైన సినిమా ఈ స్థాయి కలెక్షన్లు రాబట్టడం అనూహ్యం. ఒక్క హిందీ వెర్షన్ మాత్రమే రూ.450 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టడం ట్రేడ్ వర్గాలకు పెద్ద షాకే. ఆల్ టైం కలెక్షన్ల రికార్డుల్లో ఈ చిత్రానిది మూడో స్థానం.
దంగల్, బాహుబలి-2 తర్వాత అత్యధిక వసూళ్ల ఘనత ఈ చిత్రం పేరు మీదే ఉంది. ఈ చిత్రం ఒక అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకుంది. దేశంలో ఒక మల్టీప్లెక్స్ ఛైన్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇండియాలో అత్యధిక స్క్రీన్లు ఉన్న పీవీఆర్ మల్టీపెక్సుల్లో మాత్రమే రూ.121 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందట కేజీఎఫ్-2. ఇప్పటిదాకా ఇండియాలో ఏ సినిమా కూడా ఒక మల్టీప్లెక్స్ ఛైన్లో రూ.100 కోట్ల కలెక్షన్ల మార్కును కూడా అందుకోలేదు. కేజీఎఫ్-2 కంటే ముందు రిలీజైన ఆర్ఆర్ఆర్.. పీవీఆర్‌తో టై అప్ అవడం తెలిసిందే. ఆ చిత్రం ఫుల్ రన్లో పీవీఆర్ మల్టీప్లెక్సుల్లో రూ.94 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసింది. అది అప్పటికి ఆల్ టైం రికార్డు.
కేజీఎఫ్-2 దాని మీద ఇంకో 30 కోట్లు ఎక్కువే కలెక్ట్ చేసింది. ఈ సినిమా ఓవరాల్ థియేట్రికల్ రన్ నెల రోజులకే దాదాపు ముగిసినప్పటికీ.. పీవీఆర్ సహా కొన్ని మల్టీప్లెక్సుల్లో తర్వాత కూడా కొన్ని షోలు నడిచాయి. ఈ చిత్రం 100 రోజుల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పీవీఆర్ ఓవరాల్ వసూళ్ల లెక్కలు బయటికి వచ్చాయి. ఈ సినిమా సాధించిన విజయం చూశాక ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్-3 తీయడానికి మరింత ఉత్సాహం చూపిస్తాడనడంలో సందేహం లేదు.
This post was last modified on July 26, 2022 10:41 pm
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…