కొన్నిసార్లు ఒక్క పాటతో సినిమాకు క్రేజ్ వచ్చేస్తుంటుంది. ఆ పాట కోసమే సినిమా చూడ్డానికి వెళ్తుంటారు ప్రేక్షకులు. ఆ పాటకు తోడు సినిమా కూడా బాగుంటే బోనస్ అవుతుంది. సినిమా పెద్ద రేంజికి వెళ్తుంది. పాట తప్ప సినిమాలో విషయం లేకుంటే చల్లబడిపోతుంది. ఈ వారం అలాంటి సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
అదే.. విక్రాంత్ రోణ. కన్నడ సూపర్ స్టార్లలో ఒకడైన కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రమిది. ఈ సినిమా గురించి బాగా చర్చ జరిగేలా చేసింది.. అందులోని ‘రా రా రక్కమ్మా’ పాటే. ఒక కన్నడ పాటకు ఎన్నడూ లేనంత రీచ్ వచ్చింది దీంతోనే. ఇన్‌స్టా రీల్స్‌లో అయితే ‘రా రా రక్కమ్మా’ ఒక సెన్సేషనే. భాషా భేదం లేకుండా దేశవ్యాప్తంగా జనాలను ఈ పాట ఊపేసింది. బదాయ్ బదాయ్ తర్వాత ఈ మధ్య కాలంలో ఇంతగా జనాలకు కిక్కిచ్చి, వారితో స్టెప్పులేయించిన పాట ఇదే. పాట వల్ల సినిమాకు కూడా హైప్ వచ్చింది.
ఐతే సుదీప్ అండ్ టీం కేవలం ఈ పాటనే నమ్ముకోవట్లేదు. ఇది సుదీప్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం. గతంలో ‘రంగి తరంగ’ లాంటి అవార్డ్ విన్నింగ్ మూవీ తీసి తన పేరు మార్మోగేలా చేసిన అనూప్ బండారి రూపొందించిన చిత్రమిది. ఫాంటసీ-ఫోక్ టచ్ ఉన్న కథాంశంతో ఉత్కంఠభరితంగా సాగేలా కనిపించింది ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ చూస్తే. విజువల్స్, సెట్టింగ్స్, బీజీఎం అన్నీ కూడా ఆకట్టుకున్నాయి ట్రైలర్లో. ఐతే అసలేం చెప్పదలుచుకున్నారో అర్థం కాని గందరగోళం కూడా కనిపించింది ట్రైలర్ చూస్తే.
ఐతే కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా మంచి ఛాయిస్ లాగే కనిపిస్తోంది. ‘ఈగ’తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించిన సుదీప్.. ఆ పాపులారిటీని తర్వాత వాడుకోలేకపోయాడు. ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు. తన డబ్బింగ్ సినిమాలు అసలు వర్కవుట్ కాలేదు.
ఐతే ‘విక్రాంత్ రోణ’తో పరిస్థితి మారుతుందని, తెలుగులో మళ్లీ తనదైన ముద్ర వేయగలనని ఆశిస్తున్నాడు సుదీప్. ఈ నెల 28న ‘విక్రాంత్ రోణ’ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. డైరెక్ట్ తెలుగు సినిమా తరహాలో రిలీజ్ గట్టిగానే చేస్తున్నారు. చూద్దాం మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత మెప్పిస్తుందో?
This post was last modified on July 26, 2022 7:06 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…